Advertisementt

పెద్దల అసలు రూపం బయటపెడతానంటోంది!

Sun 19th May 2019 10:28 PM
shakila,targets,top stars,biopic  పెద్దల అసలు రూపం బయటపెడతానంటోంది!
Shakila Sensational Comments on Big Stars పెద్దల అసలు రూపం బయటపెడతానంటోంది!
Advertisement
Ads by CJ

నేటితరానికి సన్నిలియోన్‌ బాగా తెలుసు అనేకంటే సినీ ప్రేమికులకు ఆమె పేరు చెబితే నిద్ర పట్టదని చెప్పాలి. కానీ దీని ముందు తరానికి అంటే దాదాపు 15 నుంచి 20 ఏళ్ల కిందట మలయాళ చిత్రాలతో సంచలనం సృష్టించిన షకీలా నేడు సన్నిలియోన్‌లా సంచనలం సృష్టించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ఈ ముస్లిం మహిళ పోర్న్‌స్టార్‌గా మల్లూవుడ్‌నే కాదు.. వాటి డబ్బింగ్‌ చిత్రాల ద్వారా సౌత్‌ ఇండస్ట్రీని మొత్తం ఓ ఊపు ఊపింది. అంత భారీ శరీరం ఉన్నా కూడా ఆమె సెక్సప్పీల్‌ చూసి అందరు విస్తుపోయేవారు. నాడు మలయాళంలో ఈమె నటించిన చిత్రం విడుదలవుతోంది అని తెలిస్తే ఆ రిలీజ్‌ డేట్‌కి తమ చిత్రాలు రాకుండా స్టార్‌ హీరోలైన మమ్ముట్టి, మోహన్‌లాల్‌, సురేష్‌గోపి వంటి వారు కూడా సినిమాలను వాయిదా వేసుకునే వారు. నాడు ఆమెని తొక్కేయాలని ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ న్యూస్‌లు నాడు సినీ ప్రేక్షకుల్లో సంచలనాలు సృష్టించేవి. ఆ తర్వాత ఆమె కొన్ని కారణాల వల్ల తెలుగుకి వచ్చి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, ఏదో చిన్నపాటి వ్యాంప్‌ పాత్రలు చేస్తోంది. 

ఇక ఈమె బయోపిక్‌గా రిచా చద్దా, షకీలా పాత్రలో నటిస్తున్న చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. నాటి శిల్క్‌స్మిత బయోపిక్‌ ‘డర్టీ పిక్చర్‌’ స్థాయిలో ఈ చిత్రం విజయం సాధిస్తుందని యూనిట్‌ నమ్మకంగా ఉంది. అందుకే ఈ మూవీని హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు. కానీ ఈ చిత్రానికి ఇప్పటివరకు ఇంకా సంచలనమైన బజ్‌ రాలేదు. కానీ షకీలా తాజాగా చేసిన  స్టేట్‌మెంట్‌తో ఈమూవీ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. 

నాటి కాలంలో తనని తొక్కేయాలని, అణిచివేయాలని చూసిన బడా బడా స్టార్స్‌ నుంచి చిన్నచితకా నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారందరినీ ఈ చిత్రంలో వారు చేసిన కుట్రలను చూపించనున్నామని షకీలా స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇదేదో ఆమె మగాళ్ల ఆధిపత్యం కొనసాగే చిత్ర పరిశ్రమలోని బడా బడా వ్యక్తులను ఈ చిత్రంలో చూపించనుందనే వార్త చాలా మంది గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. మరి ఈమె తన బయోపిక్‌లో ఆయా వ్యక్తులను పేర్లతో సహా చెబుతూ సెన్సేషన్‌ సృష్టించనుందా? లేక వారిని ఇన్‌డైరెక్ట్‌గా ప్రేక్షకులు గుర్తు పట్టేలా చేస్తుందా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. 

Shakila Sensational Comments on Big Stars:

Shakila Targets Top Stars