గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ పరుశురామ్ ఈ సినిమా తరువాత ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా ఏంటో అనౌన్స్ చేయలేదు. కానీ తన నెక్స్ట్ మూవీ గీత ఆర్ట్స్ లోనే అని అర్ధం అయింది. గీత గోవిందం షూటింగ్ జరుగుతున్న టైంలోనే పరుశురామ్ తో డీల్ కుదుర్చుకుంది గీత. అప్పటినుండి పరుశురామ్ గీతలోనే కథలు అల్లుకుంటూ ఉన్నారు.
రీసెంట్ గా ఆయన మహేష్ బాబుని కలిసి ఓ కథ కూడా చెప్పాడు. దాంతో మహేష్ - పరుశురామ్ ల సినిమా కన్‌ఫర్మ్ అని.. అది గీత ఆర్ట్స్ లోనే అని అనుకున్నారు అంతా. కానీ ఆ సినిమా గీత ఆర్ట్స్ లో కాదట. మహేష్-పరుశురామ్ సినిమా వుండొచ్చు కానీ, గీతాలో మాత్రం కాదని తెలుస్తోంది. ఉంటే మైత్రిలో ఉండొచ్చని తెలుస్తుంది.
కారణం ఈ డైరెక్టర్ దగ్గర గీత గోవిందం మూవీ తరువాత చాలా మంది అడ్వాన్స్ లు వున్నాయని టాక్. అందులో మైత్రి వారి అడ్వాన్స్ ఉండడంతో మహేష్ మూవీ పరుశురామ్ ఆ బ్యానర్ లో చేయొచ్చని తెలుస్తుంది. ఒకవేళ మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ కాంబినేషన్ లో మూవీ ఉండొచ్చు. గీతలో పరుశురామ్ సినిమా ఉంటుంది కానీ అది వేరే హీరోతో.