Advertisementt

రకుల్ ప్రీత్ లెగ్.. అక్కడ ఫ్లాపే..!

Sat 18th May 2019 08:46 PM
ajay devgan,tabu,rakul preet singh,de de pyaar de movie,flop,bollywood  రకుల్ ప్రీత్ లెగ్.. అక్కడ ఫ్లాపే..!
Rakul Preet Singh Gets Flop With Bollywood Film రకుల్ ప్రీత్ లెగ్.. అక్కడ ఫ్లాపే..!
Advertisement
Ads by CJ

గత ఏడాది తెలుగు తమిళంలో ఫెయిల్ అయ్యి అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ మీద భారీ ఆశలే పెట్టుకుంది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ - టబుతో కలిసి దే దే ప్యార్‌ దే సినిమాలో నటించింది. ఇక ఆ సినిమాలో నటిస్తున్నప్పుడే రకుల్ మళ్ళీ తెలుగు సినిమాలతో బిజీ అయ్యింది. ఇక దే దే ప్యార్‌ దే సినిమా కోసం ఇప్పటివరకు తెలుగు, తమిళంలో కూడా చూపించని హాట్ హాట్ యాంగిల్స్ ని చూపించింది. గ్లామర్తో అందాల ఆరబోతలో రకుల్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే తేలుతుంది. ఇక గత రెండు నెలలుగా దే దే ప్యార్‌ దే ప్రమోషన్స్ లో రకుల్ రోజూ పాల్గొంటూ తెగ హడావిడి చేసింది.

మరి నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  దే దే ప్యార్‌ దే సినిమా అకీవ్‌ అలీ డైరెక్షన్ లో తెరకెక్కింది. దే దే ప్యార్‌ దే సినిమా కథలోకి వెళితే అజయ్ దేవగన్ తన భార్య టబుతో విడిపోయి 18 ఏళ్లగా విడిగా ఉంటాడు. ఇక 25 ఏళ్ళ కూతురు, 20 ఏళ్ల కొడుకు ఉన్న అజయ్ దేవగన్ తన కూతురు వయసున్న రకుల్ మీద మనసు పారేసుకుంటాడు. ఇక రకుల్ ని తన ఫ్యామిలీకి పరిచయం చేయగా అజయ్ కూతురు, కొడుకు రకుల్ ని ఒప్పుకోరు. కానీ అజయ్, రకుల్ ని పెళ్లి చేసుకోవాలంటే కొడుకు, కూతురుని ఒప్పించే పెళ్లి చేసుకోవాలి. మరి చివరికి వాళ్ళని ఒప్పించాడా లేదా అనేది మిగతా కథ.

మరి ఈ సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. అజయ్, తబలా నటన సినిమాకే హైలెట్ అనేలా ఉంటే.. రకుల్‌ గ్లామర్‌ డోస్‌ పెంచినట్లు అనిపిస్తుంది. అయితే సినిమాలో టబు కంటే అజయ్‌, రకుల్‌ల పాత్రలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. కానీ రకుల్‌ పాత్ర గురించి చెప్పుకోదగ్గ అంశమేమీ కనిపించదు. ఇందుకు కారణం రకుల్ పాత్రను దర్శకుడు బలంగా తీర్చిదిద్దకపోవడమే. కథలాగే స్క్రీన్‌ప్లే కూడా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. మరి రకుల్ బాలీవుడ్ నుండి ఇదే కోరుకుందా? బాలీవుడ్ లో ఒక సినిమాతో హిట్ కొడితే మరిన్ని అవకాశాలొస్తాయని... బాగా జిమ్ చేసి మరీ జీరో సైజు మెయింటింగ్ చేసింది.

Rakul Preet Singh Gets Flop With Bollywood Film:

Rakul Preet Singh Leg Effect.. DE DE Pyaar DE Flop

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ