Advertisementt

చిరు, మహేష్‌‌లు కాదు... విశాలే రియల్‌ హీరో!

Sat 18th May 2019 07:19 PM
vishal,temper remake,chiranjeevi,mahesh babu,farmers,ayogya movie,donates,movie tickets  చిరు, మహేష్‌‌లు కాదు... విశాలే రియల్‌ హీరో!
Vishal is The Real Hero చిరు, మహేష్‌‌లు కాదు... విశాలే రియల్‌ హీరో!
Advertisement

జై జవాన్‌.. జైకిసాన్‌ అనేది కేవలం ఓట్ల బ్యాంక్‌ నినాదంగా మారుతోంది. ఒక చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగికి నెలకి వచ్చే జీతం 10 ఎకరాలు ఉన్నరైతుకు మాత్రం రావడం లేదు. నిజానికి ఏ వస్తువైనా తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తి ధరను తామే నిర్ణయించుకుంటారు. కానీ రైతుల పరిస్థితి అది కాదు. ప్రభుత్వాలు, దళారులు చెప్పిన ధరకే తాము సాగు చేసే వాటిని అమ్మాల్సివస్తుంది. గిట్టుబాటు ధరను నిర్ణయించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. 

ఇక విషయానికి వస్తే ‘మహర్షి’ చిత్రం టాక్‌ ఎలా ఉన్నా కలెక్షన్లు బాగా ఉన్నాయి. ఈ చిత్రం వేసవి సెలవులను బాగా వాడుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో రైతుల మీద తీసిన సన్నివేశాలు, రైతుని చూసి జాలిపడటం కాదు.. గౌరవించండి అనే మెసేజ్‌ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. గతంలో ‘కత్తి’ రీమేక్‌ ‘ఖైదీనెంబర్‌ 150’లో కూడా చిరంజీవి ఇలాంటి మెసేజ్‌నే ఇచ్చాడు. కానీ నిజజీవితంలో వీరు రైతులకు చేస్తున్న సాయం ఏమిటి? అనేది ప్రశ్నార్దకమే. అదేమంటే మేము గుప్తదానాలు చేస్తామంటుంటారు. ఇందులో నిజానిజాలు వారికే తెలియాలి. ఈ విషయంలో హీరోలు కోలీవుడ్‌ యంగ్‌స్టార్‌, తెలుగు కుర్రాడు విశాల్‌ని చూసి ఎంతో నేర్చుకోవాలి. నాడు తమిళనాడు రైతులు తమ సమస్యలపై ఢిల్లీలో అర్థనగ్న ప్రదర్శన చేస్తే తాను అక్కడికి వెళ్లి మద్దతు ఇచ్చాడు. 

ఇక ఈయన నటించిన తెలుగు ‘టెంపర్‌’ రీమేక్‌ ‘అయోగ్య’ తమిళంలో మంచి టాక్‌ తెచ్చుకుంది. ఫుల్‌రన్‌లో ఈ చిత్రానికి 20 నుంచి 25లక్షల వరకు టిక్కెట్లు తెగే అవకాశం ఉంది. దాంతో విశాల్‌ ఈ సినిమాని చూసే ప్రేక్షకులు కొన్న ప్రతి టిక్కెట్‌ నుంచి ఒక రూపాయిని రైతుల సంక్షేమ నిధికి అందిస్తు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈయన ‘అభిమన్యుడు’ నుంచి ఇదే రూల్‌ ఫాలో అవుతున్నాడు. అందుకే విశాల్‌ని రీల్‌ హీరో కాదు.. రియల్‌ హీరో అని తమిళతంబిలు తమ సొంత వాడిగా చూసుకుంటూ ఉండటం విశేషం. 

Vishal is The Real Hero:

Vishal Gives RS.1 to the Farmers From his Tickets Price 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement