Advertisementt

సహస్ర మూవీ మేకర్స్ మూవీ టైటిల్ ఫిక్స్

Sat 18th May 2019 11:43 AM
star,sahasra movie makers,naveen sanjay,heena achhara,star movie  సహస్ర మూవీ మేకర్స్ మూవీ టైటిల్ ఫిక్స్
Sahasra Movie Makers Film Title Fixed సహస్ర మూవీ మేకర్స్ మూవీ టైటిల్ ఫిక్స్
Advertisement
Ads by CJ

సహస్ర మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ సంజయ్ (శరణం గచ్చామి ఫేమ్), హీన అచ్చర హీరో హీరోయిన్స్ గా వస్తున్న చిత్రానికి ‘స్టార్’ అనే టైటిల్‌ని ఖరారు చేసి మీడియా సమావేశంలో స్టార్ టైటిల్‌ని ప్రకటించారు. శ్రీహరి పట్టపు నిర్మాతగా, మాల్యాద్రి మామిడి(ప్రదీప్) దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో నవీన్ సంజయ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం నేను శరణం గచ్చామి మూవీలో లీడ్ చేసాను ఇప్పుడు సహస్ర మూవీ మేకర్స్‌లో ‘స్టార్’ మూవీ చేస్తున్నాను. ప్రదీప్ మామిడి నాకు కథ చెప్పగానే నాకు బాగా నచ్చి ఒప్పుకున్నాను. ఈ స్టార్ మూవీలో నేను ఒక స్ట్రీట్ ఫైటర్‌గా చేస్తున్నాను. నా బాడీకి తగట్టు ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన శ్రీహరి గారికి, మాల్యాద్రి (ప్రదీప్) గారికి థాంక్స్ అని చెప్పారు.

హీరోయిన్ మాట్లాడుతూ.. ‘‘స్టార్ మూవీలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రదీప్ సార్.  ప్రొడ్యూసర్ శ్రీహరిగారికి చాలా థాంక్స్. ఈ చిత్రంలో నేను టైటిల్ రోల్ చేస్తున్నాను. స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. నా కో ఆర్టిస్ట్ నవీన్ గారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మాకు మంచి పేరు తెస్తుంది అని నమ్మకం ఉంది..’’ అన్నారు.

అపూర్వ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నేను ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..’’ అన్నారు.

ప్రొడ్యూసర్ శ్రీహరి పట్టపు మాట్లాడుతూ.. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా దర్శకుడు మాల్యాద్రి మామిడి (ప్రదీప్) చెప్పిన కథ మాకు నచ్చిన వెంటనే సెట్స్ పైకి వెళ్లి మొదటి షెడ్యూల్ పూర్తి చేశాము. నాకు చూపిన దానికంటే దర్శకుడు బాగా ఔట్ ఫుట్ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలో మిగతా షూటింగ్ పూర్తి చేసుకుంటాము మీ మీడియా సపోర్ట్ మా స్టార్ మూవీకి ఉండాలి అని చెప్పారు

దర్శకుడు మాల్యాద్రి మామిడి మాట్లాడుతూ... మీడియా మిత్రులకు నమస్కారం. మా సహస్ర మూవీ మేకర్స్‌లో వస్తున్న చిత్ర టైటిల్ ‘స్టార్’ని ఈ రోజు మీడియా సమక్షంలో విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ ‘స్టార్’ కథని, నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మా నిర్మాత శ్రీహరి పట్టపుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ కామెడీతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ఈ ‘స్టార్’ మూవీ షూటింగ్ హీరో హీరోయిన్‌లపై కొంత మెయిన్ టాకీ పార్ట్ హైదరాబాద్‌లో 30శాతం పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యుల్‌తో మూవీ 70 శాతం పూర్తి చేసుకుంటుంది..’’ అని తెలిపారు.

Sahasra Movie Makers Film Title Fixed:

Star is the Title for Sahasra Movie Makers Film 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ