శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ నిర్మాణంలో శ్రీ పవార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘2 అవర్స్ లవ్’. కృతి గార్గ్ హీరోయిన్. ఇప్పటి వరకు చాలా ప్రేమ కథలను ప్రేక్షకులు చూసుంటారు. కానీ సరికొత్త ప్రేమ కథాంశంతో ‘2 అవర్స్ లవ్’ చిత్రం తెరకెక్కుతోంది అంటున్నారు హీరో, దర్శకుడు శ్రీపవార్. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు శ్రీపవార్ మాట్లాడుతూ.. ‘‘సరికొత్త లవ్ కాన్సెప్ట్‌తో ‘2 అవర్స్ లవ్’ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమలో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయనే విషయాన్ని మా సినిమాలో చూపించాం. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త‌్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.
శ్రీపవార్, క్రితి గార్గ్, తనికెళ్ళభరణి, నర్సింగ్ యాదవ్, అశోక్ వర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీపవార్, నిర్మాణం: శ్రీనిక క్రియేటివ్ వర్క్స్, సినిమాటోగ్రఫీ: ప‌్రవీణ్ వనమాలి, ఎడిటర్: శ్యాం వడవల్లి, మ్యూజిక్: గ్యాని సింగ్, ఆర్ట్: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అఖిల గంజి, కో డైరెక్టర్: ఎం.శ్రీనివాస్ రాజు.