‘ఐ థింక్... అయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్’ - ఆరుగురు అమ్మాయిలు ఇదే మాట చెప్పారు. అతడు ఆరుసార్లు నవ్వాడు. అరుగురికీ ముద్దులు పెట్టాడు. ముగ్గులోకి దింపాడు. అతడి కథేంటి అనేది జూన్ 5న తెలుస్తుంది.
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల అయింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు.
అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ‘సెవెన్’ ఫస్ట్ కాపీ చూశాను. మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. థ్రిల్లర్ ఫిల్మ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందీ సినిమా. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. నిర్మాణంలోనూ రాజీ పడలేదు. రిచ్‌గా సినిమా తీశారు. ఆయన కథ సినిమాకు ఒక హైలెట్ అయితే... హవీష్ యాక్టింగ్ మరో హైలెట్. నటుడిగా కొత్త హవీష్ ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు. మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ సూపర్. ఆరుగురు హీరోయిన్ల పాత్రలు కథలో భాగంగా సాగుతాయి. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ఫస్ట్ కాపీ చూశాక... విపరీతంగా నచ్చడంతో సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.
సినిమాలో తారాగణం:
పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, ‘జబర్దస్త్’ వేణు, ధనరాజ్, సత్య, ‘జోష్’ రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.
సినిమా సాంకేతిక వర్గం:
స్టిల్స్: శీను, పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ, వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్, చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై, కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్), ఆర్ట్ డైరెక్టర్: గాంధీ, లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్, కొరియోగ్రఫీ: సతీష్, విజయ్, డైలాగ్స్: జీఆర్ మహర్షి, స్టంట్స్: వెంకట్ మహేష్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ - దర్శకత్వం నిజార్ షఫీ.