Advertisementt

బాలయ్యతో ఆ యంగ్ హీరోయిన్ చేయట్లేదు

Fri 17th May 2019 11:40 AM
payal rajput,balakrishna,ks ravi kumar,dropped,next movie  బాలయ్యతో ఆ యంగ్ హీరోయిన్ చేయట్లేదు
No Payal Rajput in Balayya and KS Ravikumar Film బాలయ్యతో ఆ యంగ్ హీరోయిన్ చేయట్లేదు
Advertisement
Ads by CJ

బాలయ్య, కె.ఎస్. రవికుమార్, సి. కళ్యాణ్ కాంబినేషన్‌లో ‘జైసింహా’ తర్వాత మరో చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతున్న విషయం తెలిసిందే. జగపతిబాబు విలన్‌గా డబుల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇప్పటికే పలు రకాల వార్తలు సంచరిస్తున్నాయి. ముందుగా ‘జైసింహా’లో నటించిన హరిప్రియ ఇందులో మరోసారి ఛాన్స్ కొట్టేసిందని అన్నారు. ఆ తర్వాత అలాంటి వార్తలేమీ రాలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో యంగ్ హీరోయిన్, ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటిస్తుందనే వార్తలు వినవస్తున్నాయి. దాదాపు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా సోషల్ మీడియాలో తేల్చేశారు.

అయితే చిత్ర నిర్మాత మాత్రం ఈ వార్తలను కొట్టేస్తున్నారు. బాలయ్యతో చేయబోతున్న ఈ సినిమా కోసం ఇంకా హీరోయిన్‌ గురించి అనుకోలేదని, ఓ సీనియర్ హీరోయిన్‌ని సంప్రదించాం కానీ, ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని తెలిపారు. ఇక పాయల్ రాజపుత్‌ను అసలు ఈ సినిమాకు అనుకోలేదని, ఎవరు ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారో మాకు తెలియదని తెలిపారు. హీరోయిన్ సెలక్ట్ అవ్వగానే మేమే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 

సో.. నిర్మాత క్లారిటీ ఇచ్చాడు కాబట్టి.. బాలయ్య సరసన పాయల్ రాజపుత్ చేయడం లేదనేది తెలిపోయింది. మరి చిత్రయూనిట్ సంప్రదించిన ఆ సీనియర్ హీరోయిన్ ఎవరా అనే దానిపై మళ్లీ వార్తలు పుట్టుకొస్తున్నాయి. అనుష్క లేదా త్రిషలలో ఒకరిని ఈ సినిమాకు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా టాక్.

No Payal Rajput in Balayya and KS Ravikumar Film:

Senior Heroine in Balakrishna and KS Ravikumar Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ