Advertisementt

‘మహర్షి’.. ఇంకా ఎన్ని పార్టీలు చేసుకుంటారు!

Fri 17th May 2019 11:01 AM
mahesh babu,vamsi paidipalli,dil raju,team,party,maharshi movie,hit  ‘మహర్షి’.. ఇంకా ఎన్ని పార్టీలు చేసుకుంటారు!
No Break to Maharshi Celebrations ‘మహర్షి’.. ఇంకా ఎన్ని పార్టీలు చేసుకుంటారు!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు మహర్షి సినిమా విజయంతో గాల్లో తేలిపోతున్నాడు. ఎన్నడూ లేనిది... సినిమా ప్రమోషన్స్ లో తెగ జోష్ చూపిస్తున్నాడు. అంతేనా... సినిమా థియేటర్స్ ని విసిట్ చేసి మరీ ఫ్యాన్స్ ని కలుస్తున్నాడు. తన 25 వ సినిమా ఎపిక్ హిట్ అంటూ తెగ హడావిడి చేస్తున్నాడు. అలాగే దర్శకుడు వంశి పైడిపల్లికి హగ్గులు, దిల్ రాజుని పొగడ్తలతో ముంచిలేపుతున్నాడు. ఇక సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది మొదలు హుషారుగా రోజుకో పార్టీ ఇస్తున్నాడు. మహర్షి విడుదలైన రోజు నైట్ తన ఇంట్లోనే సూపర్ పార్టీ ఇచ్చాడు మహేష్ బాబు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలతో పాటుగా మహర్షి డైరెక్టర్ వంశి, నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ, నమ్రత, హీరోయిన్ పూజా హెగ్డే లు పాల్గొన్నారు. ఇక మధ్యలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతోనూ పార్టీ చేసుకున్నాడు మహేష్.

తాజాగా నిన్న బుధవారం, మహర్షి టీం మొత్తం సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ ని విసిట్ చేసింది. అక్కడ ప్రేక్షకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన మహేష్ అండ్ మహర్షి టీం సాయంత్రం కాగానే పార్టీ మూడ్ లోకి మారిపోయారు. హీరోయిన్ పూజా హెగ్డే, వంశి పైడిపల్లి, దిల్ రాజు, ప్రకాష్ రాజ్, జయసుధ, అల్లరి నరేష్ ఇలా మహర్షి టీం మొత్తం మళ్ళీ పార్టీ చేసుకుంది. 

మరి ఈ పార్టీల జోరు చూస్తుంటే మహేష్ ఎంత ఆనందంలో మునిగి తేలుతున్నాడో అర్ధమవుతుంది. మరి మహర్షి మహేష్ అనుకున్న రేంజ్ సినిమానేనా అంటూ చాలామంది చాలా డౌట్స్ రేజ్ చేసిన మహేష్ మాత్రం మహర్షి విజయాన్ని పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నాడు.

No Break to Maharshi Celebrations:

Maharshi Team Arranged One More Party

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ