Advertisementt

వాల్మీకి హిట్టయితే వరుణ్ణి పట్టుకోగలరా!

Thu 16th May 2019 06:26 PM
varun tej,valmiki movie,remuneration,hiked  వాల్మీకి హిట్టయితే వరుణ్ణి పట్టుకోగలరా!
Varun Tej Salary Hiked వాల్మీకి హిట్టయితే వరుణ్ణి పట్టుకోగలరా!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మెగా హీరోల్లో మీడియం రేంజ్ లో ఉన్న వరుణ్ తేజ్ మీద దర్శకనిర్మాతల కన్ను పడింది. ఎందుకంటే హీరోయిజం చూపించకుండా కథ నచ్చితే సినిమాలు చేస్తూ పోతున్న వరుణ్ తేజ్ సాలిడ్ హిట్స్ కొడుతున్నాడు. ఫిదాలో సాయి పల్లవి క్రేజ్ ముందు తట్టుకుని నిలబడిన వరుణ్ తేజ్... సోలోగా తొలిప్రేమతో మంచి హిట్ కొట్టాడు. ఇక అంతరిక్షం ఓకే అనిపించినా... వెంకటేష్ తో కలిసి ఎఫ్ 2 మల్టీస్టారర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ కి కథ, తన పాత్ర నచ్చితే చాలు సినిమా చేస్తున్నాడు. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో డిఫ్రెంట్ లుక్ లో నెగెటివ్ కేరెక్టర్ లో వాల్మీకి సినిమాలో నటిస్తున్నాడు.

మరి వరస హిట్స్ తో వరుణ్ తేజ్ రేంజ్ పెరిగినట్లే కనబడుతుంది. అందుకే వరుణ్ తేజ్ తన పారితోషకాన్ని కూడా పెంచేసాడనే టాక్ మొదలైంది. వాల్మీకి సినిమాకి ఆచి తూచి నిర్మాతల నుండి 5 కోట్ల పారితోషకాన్ని వరుణ్ తేజ్ డిమాండ్ చేసినట్లుగా... వరుణ్ ఎలాగూ మీడియం రేంజ్ హీరోగా... దర్శకనిర్మాతల పాలిట మినిమమ్ గ్యారెంటీ హీరో కాబట్టి.. అడిగింది ఇవ్వడానికి రెడీ అయ్యారట. 

ఇక వరుణ్ తేజ్ నటించబోయే స్పోర్ట్స్‌ డ్రామాలో తెరకెక్కబోయే సినిమాకి కూడా ఈ 5 కోట్ల పారితోషకాన్ని కంటిన్యూ చేయబోతున్నాడట. ఈ సినిమాలు హిట్ అయితే గనక వరుణ్ తేజ్ తన పారితోషకాన్ని మరో కోటి పెంచినా పెంచెయ్యొచ్చన్న టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. మరి వరస సినిమాలు చేస్తూ బిజీగా వున్న ఈ మెగా హీరో కెరీర్ ఇప్పుడు పూలబాటలానే కనబడుతుంది.

Varun Tej Salary Hiked:

Varun Tej Remuneration Ofter Valmiki

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ