లాంగ్ వీకెండ్‌లో రిలీజ్ అయిన మహర్షి చిత్రానికి సోమవారం నుండి అసలు పరీక్ష మొదలుకానుంది. మే 9 గురువారం రిలీజ్ అయిన మహర్షి నాలుగు రోజుల్లో బాగానే వసూలు చేసింది. పైగా టికెట్స్ ధరలు కూడా పెంచడం ఈ మూవీకి ప్లస్ అయింది. వీకెండ్‌లో నాలుగు రోజుల కలెక్షన్స్‌కి ఎటువంటి అంతరాయం కలుగలేదు. అయితే అసలు పరీక్ష సోమవారం నుండే.
సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలవుతాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వీక్ డేస్‌లో డ్రాప్ ఉండటం సహజం. కాకపోతే ఎంత మోతాదులో ఉంటుంది అనే దాన్ని బట్టే సినిమా కలెక్షన్స్ అండ్ రిజల్ట్ ఆధారపడి ఉంటది. సోమవారం ఉదయం ఆటకి సిటీస్‌లో సింగల్ స్క్రీన్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయని సమాచారం అందుతుంది.
ఫస్ట్ ఫోర్ డేస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది పక్కన పెట్టి.. ఈ సోమవారం ఎన్ని కలెక్షన్లు కొట్టగొట్టాడు అనే దానితో ‘మహర్షి’పై ఓ క్లారిటీ రానుంది. దీనిని బట్టి మహర్షి ఓవరాల్‌గా ఎంత కలెక్ట్ చేస్తుంది...ప్రాఫిట్ వెంచరా కాదా.. అనేది తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్‌లో శుక్రవారం అల్లు శిరీష్ ఎబిసిడి ఉంది కానీ అది మరీ మహేష్ సినిమాని ప్రభావితం చేస్తుందని అనుకోలేం. కలెక్షన్స్ పై దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.