ఏడాదికి మూడు నాలుగు చిత్రాలు చేస్తూ మినిమం గ్యారంటీ స్టార్‌గా, తనదైన మేనరిజమ్‌తో హాస్యాన్ని కూడా పండించే టిపికల్ క్యారెక్టర్ పాత్రలకు మాస్ మహారాజా రవితేజ పెట్టింది పేరు. కానీ ఈ మధ్య ఆయన సినిమాలు దారుణ ఫలితాలను సాధిస్తున్నాయి. కేవలం తనకు నప్పే మూస పాత్రలను, కథలను ఎంచుకుంటూ ఆయన డీలాపడ్డాడు. ఇవి ప్రేక్షకులకు రొటీన్ ఫీలింగ్స్‌ని కలిగిస్తున్నాయి. అయినా రవితేజ మాత్రం తాననుకున్న దారి నుంచి బయటకు రాలేకపోతున్నాడు. మరోవైపు సిక్స్‌ప్యాక్ పుణ్యమా అని ఆయన ఫేస్‌లో మునుపటి గ్రేస్ తగ్గి ముసలాడిగా కనిపిస్తూ ఉండటం కూడా మైనస్ అవుతోంది. ఒకప్పుడు రవితేజ చిత్రం అంటే ఎగబడిన బయ్యర్లు, నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు ఆయనకు దూరంగా జరుగుతున్నారు. రాజా ది గ్రేట్ విజయం క్రెడిట్ దిల్‌రాజు, అనిల్ రావిపూడిలకు దక్కింది. హీరోని అంథునిగా చూపించానా కమర్షియల్ అంశాలను మిస్ కాకుండా చూసుకోవడంతో ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రం తప్ప ఇటీవలి కాలంలో ఆయన సత్తా చాటిని చిత్రం మరోటి లేదనే చెప్పాలి. నేలటిక్కెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనిలతో ఆయన క్రేజ్, ఇమేజ్‌లు పాతాళానికి పడిపోయాయి.
కాగా ప్రస్తుతం ఆయన ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ చిత్రం చేస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతికి కూడా ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీనెంబర్ 150 తర్వాత ఇంటెలిజెంట్ వంటి చిత్రంతో వినాయక్ అంటే హీరోలు భయపడిపోతున్నారు. సహజంగా ట్రాక్ రికార్డు పట్టించుకోని బాలయ్య కూడా వినాయక్‌ని పక్కనపెట్టి తమిళ దర్శకుడు కె.యస్.రవికుమార్ మీదనే నమ్మకం చూపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీతో వినాయక్ రవితేజతో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
నిర్మాతగా నల్లమలుపు బుజ్జి పేరు వినిపిస్తోంది. డిస్కోరాజా తర్వాత వెంటనే వినాయక్ చిత్రాన్ని సెట్ చేసి ఇదే ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. గతంలో రవితేజ, వినాయక్‌లు తిరుగులేని ఫామ్‌లో ఉన్నప్పుడు ‘కృష్ణ’ అనే చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో బ్రహ్మానందం పాత్ర నవ్వులు పూయించింది. మరి ఈ రెండు మైనస్‌లు కలిసి మరో ‘కృష్ణ’ ని ఇస్తారా? ఇలాంటి చిత్రాలను ఇంకా ప్రేక్షకులు ఆదరిస్తారా? అనేవి వేయి డాలర్ల ప్రశ్నలు.