సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’.. మే 9న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. డే1 కలెక్షన్లు అద్భుతంగా వచ్చినప్పటికీ, డే 2 కాస్త డౌన్ అవ్వడంతో అంతా ఈ సినిమా పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా డే 3 కలెక్షన్లు పుంజుకోవడంతో చిత్రయూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇక ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఈ సినిమా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో కాలర్ ఎగరేసి మరీ తెలిపాడు.
నా 25 సినిమాల జర్నీలో మహర్షి ఎంతో ప్రత్యేకం అని తెలిపిన మహేష్.. మదర్స్ డే గురించి మాట్లాడుతూ.. అమ్మంటే దేవుడితో సమానం. ప్రతిసారి అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. అలా తాగితే నాకు దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకు ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ సక్సెస్‌ను అమ్మలందరికీ డేడికేట్ చేస్తున్నాను అన్నారు.
ఇంకా మహేష్ మాట్లాడుతూ.. నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను వన్ వీక్‌లో బీట్ చేయబోతున్నాం. ఇంతకంటే ఆనందం నాకు ఏముంటుంది. ప్రేక్షకులకు, నా అభిమానులకు హ్యాట్సాఫ్. అలాగే నరేష్‌గారికి ఈ సందర్భంగా థాంక్స్.. ఎందుకంటే, ఆయన ఈ క్యారెక్టర్‌ను చేస్తాడా? అని అనుకున్నాను. కానీ.. ఆయన ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ఇక వంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ మాట అన్నాడు. నా అభిమానులు, నాన్నగారి అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా ఈ సినిమా ఉంటుందని అన్నాడు. అభిమానులే కాదు ఇప్పుడు నేను కూడా కాలర్ ఎగరేస్తున్నాను.. అంటూ మహేష్ తన విజయానందాన్ని పంచుకున్నారు.