ఇలాంటి 3డి దెయ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. మే 24న చూద్దాం ‘లీసా 3డి’ గెట్ రెడీ
భారీ విజువల్ గ్రాఫిక్స్ కోసం 100-200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయాలా? 2.0 రేంజులో గ్రాఫిక్స్ చూపిస్తేనే హిట్టు కొట్టినట్టా? అంటే అలాంటిదేమీ అవసరం లేదని అంటున్నారు మా చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్. ఆయన తెరకెక్కించిన ‘లీసా 3డి’ ఈ సమ్మర్ సీజన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమన్న ధీమాని కనబరుస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో వీరేష్ కాసాని సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. త్వరలో ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి సినిమాను ఈ నెల 24న విడుదల చేస్తామని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.
దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘దెయ్యం సినిమాలకు క్రేజు తగ్గిందని భావిస్తున్నారా? అయితే ఆ ఆలోచనను విరమించుకోవడం గ్యారెంటీ. ఇది అన్ని దెయ్యాల సినిమాల్లా రొటీన్ గా ఉండదు. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా 3డిలో డిఫరెంట్ గా ప్రయత్నించిన చిత్రమిది. నాణ్యమైన విజువల్స్ కోసం 8కె ఫార్మాట్ లో తెరకెక్కించి 2కె ఫార్మాట్ కి మార్చాం. ఛాయాగ్రాహకుడు పీజీ ముత్తయ్య ఈ సినిమా విజువల్స్ ని మరో లెవల్లో చూపించారు. కథ ఓకే అవ్వగానే అంజలిని ఎంపిక చేసుకోవాలనుకున్నాం. తన నటన మహదాద్భుతం. ఆద్యంతం రక్తి కట్టించే పెర్ఫామెన్సెస్ స్క్రీన్ కి మీ కళ్లను కట్టి పడేయడం గ్యారెంటీ’’ అని అన్నారు.
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘‘షాపింగ్ మాల్, జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎస్.కె. పిక్చర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించాం. అంజలి నటించిన ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆ సినిమాలను ఎంతో అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అలాగే ఈ లీసా 3డి సినిమాని ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. తెలుగులో పూర్తిగా షూటింగ్ చేసిన చిత్రమిది. డిజిటల్ రూపంలో 3డిలో విడుదలవుతున్న మొట్టమొదటి హర్రర్ చిత్రంగా రికార్డులకెక్కుతోంది. ఈ సమ్మర్ కానుకగా పిల్లలు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే పూర్తి వినోదాత్మక చిత్రమిది. ముఖ్యంగా 3డి దెయ్యం గగుర్పాటుకు గురి చేయడం గ్యారెంటీ. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి
ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్
స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్
కోరియోగ్రఫీ: సురేష్
ఆర్ట్ డైరెక్టర్: వినోద్
ఈ చిత్రానికి నిర్వహణ : శ్రీనివాస్ గొండేల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రహాస్ ఇప్పలపల్లి, సమర్పణ కాసాని వీరేశ్ , నిర్మాత సురేష్ కొండేటి, కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్