ప్రస్తుతం మహేష్‌బాబు కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలై వీకెండ్‌లో మంచి కలెక్షన్లు కొల్లగొడుతోంది. మరీ మాస్టర్‌పీస్ కాకపోయినా మహేష్ ఈ చిత్రం మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు సాగుతున్నాడు. ఎందుకంటే దర్శకుడు వంశీపైడిపల్లికి ఓన్‌గా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సత్తా ఇంకా రాలేదు. వేసవి సెలవులు కావడం, మరే సినిమా కొంత కాలం పాటు పోటీలో లేకపోవడం వంటివి ఈ చిత్రానికి ప్లస్ కానున్నాయి. ఇక మహేష్ తదుపరి చిత్రం అంటే 26వ మూవీని దిల్‌రాజు-అనిల్‌సుంకరల నిర్మాణ భాగస్వామ్యంలో ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2’ వంటి చిత్రాలను తీసి అపజయమే ఎరుగకుండా జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ తరహాలో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను తీస్తున్న అనిల్‌రావిపూడికి ఈ అవకాశం లభించింది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఓ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా, ఫ్యామిలీ ఆడియన్స్‌కి సైతం నచ్చేలా అనిల్‌రావిపూడి స్క్రిప్ట్‌ని రెడీ చేస్తున్నాడు. మహేష్ అంటే అన్నివర్గాల ప్రేక్షకులకు ఇష్టం కాబట్టి మరీ మాస్‌గా కాకుండా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా, విలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీగా ఇది ఉండనుంది. ఇందులో మహేష్‌బాబుకి అత్తగా అలనాటి లేడీ అమితాబ్ విజయశాంతి చాలాకాలం తర్వాత ఇందులో నటిస్తోందని తెలుస్తోంది.
ఇక హీరోయిన్‌గా రష్మికా మందన్నాను ఎంచుకుంటున్నారు. అంటే ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అల్లుడా మజాకా, నారి నారి నడుమ మురారి’ తరహాలో ఈచిత్రం ఉంటుందని, అత్తకు ముక్కుతాడు వేసి అత్త కూతురిని సొంతం చేసుకునే అల్లుడు కథ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ మూవీని వీలైనంత తక్కువ బడ్జెట్‌లో ప్లాన్ చేస్తున్నారు. విలేజీ బ్యాక్‌డ్రాప్ కావడం కూడా దీనికి కలిసి వచ్చే అంశం. ఇక మహేష్ 27వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే ఆసక్తి మొదలైంది. మహేష్ రాజమౌళితో పాటు త్రివిక్రమ్‌తో కూడా సినిమా ఉంటుందని చెప్పడంతో పాటు సుకుమార్‌తో చిత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు.
రాజమౌళి వచ్చే ఏడాది జులై30 వరకు బిజీ బిజీ. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఆయనకు చిరంజీవితో కమిట్‌మెంట్ ఉంది. సుకుమార్ త్వరలో బన్నీతో చిత్రం చేస్తున్నాడు. సో.. వీరందరు మహేష్‌తో చేయాలంటే చాలా కాలం ఆగాల్సిందే. ఇదే సమయంలో అదృష్టం పరుశురాంకి దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఈ మూవీని గీతాఆర్ట్స్‌లో అల్లుఅరవింద్ నిర్మించే అవకాశాలు ఉండటంతో ఆయన ఈ చిత్రం వదులుకునే అవకాశం లేదని, ఖచ్చితంగా గీతాఆర్ట్స్‌లో మహేష్ 27వ చిత్రం ఉంటుందని అంటున్నారు. ఇక సందీప్‌రెడ్డి వంగా విషయం తెలియాల్సివుంది.