Advertisementt

గీత కాదు.. గోవిందుడుతో ఈసారి ప్రీతి!!

Sun 12th May 2019 05:56 PM
vijay deverakonda,next movie,heroine,shalini pandey,arjun reddy  గీత కాదు.. గోవిందుడుతో ఈసారి ప్రీతి!!
No Rashmika in Vijay Deverakonda Next Film గీత కాదు.. గోవిందుడుతో ఈసారి ప్రీతి!!
Advertisement
Ads by CJ

గీత గోవిందం సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కలిసి మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ - రష్మికల లిప్ లాక్ వలన సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డియర్ కామ్రేడ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా... అని విజయ్ ఫ్యాన్స్ అదేనండి విజయ్ అభిమాన రౌడీస్ ఎదురు చూస్తున్నారు. మరి గీత గోవిందం హిట్ తర్వాత మళ్ళీ రష్మిక మందన్నని రిపీట్ చేసిన విజయ్ దేవరకొండ ముచ్చటగా మూడోసారి రష్మిక మందన్నతో కలిసి నటించబోతున్నాడని న్యూస్ నడుస్తుంది. గోవిందుడుతో ముచ్చటగా మూడోసారి గీత అంటూ ప్రచారం జరిగింది.

ఆనంద్ అన్నామ‌లై‌ దర్శకత్వంలో విజయ దేవరకొండ నటించబోతున్న తెలుగు, తమిళ సినిమాలో విజయ్ మళ్ళీ రష్మికతో జోడీ కడుతున్నాడనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే తాజాగా గీతని కాదని.. అర్జున్ రెడ్డి భామ షాలిని పాండేతో విజయ్ మరోసారి నటించబోతున్నాడంటున్నారు. అర్జున్ రెడ్డిలో ప్రీతీ పాత్రలో విజయ్ దేవరకొండతో కలిసి లిప్ లాక్స్ తోనూ రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయిన షాలిని పాండేతో విజయ్ మళ్ళీ జోడి కడితే ఆ క్రేజే వేరు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రొఫెష‌న‌ల్ బైక‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని చెబుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకి హీరో అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారట.

No Rashmika in Vijay Deverakonda Next Film:

Again Vijay Deverakonda Romance with Arjun Reddy Heroines

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ