Advertisementt

కాజల్ మను చరిత్ర మొదలైంది

Sun 12th May 2019 11:44 AM
kajal aggarwal,manu charitra,shiva kandukuri,megha akash,new film,launch  కాజల్ మను చరిత్ర మొదలైంది
Manu Charitra Movie Launched కాజల్ మను చరిత్ర మొదలైంది
Advertisement
Ads by CJ

కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘మ‌ను చ‌రిత్ర‌’... శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంట‌గా ప్రారంభ‌మైన చిత్రం

‘మ‌ను చ‌రిత్ర‌’ చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కాజ‌ల్ అగ‌ర్వాల్ క్లాప్ కొట్ట‌గా.. సి.క‌ల్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అజ‌య్ భూప‌తి ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుధీర్ వ‌ర్మ‌, సాహు గార‌పాటి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అనీల్ సుంక‌ర్‌, రాజ్ కందుకూరి, అనీల్‌ క‌న్నెగంటి, మ‌ధుర శ్రీధ‌ర్‌, సాహు గార‌పాటి, కృష్ణ చైత‌న్య‌, కొండా విజ‌య్‌కుమార్‌, ద‌ర్శ‌కులు రాధాకృష్ణ‌, శివ నిర్వాణ‌, సుధీర్ వ‌ర్మ‌, అజ‌య్ భూప‌తి స‌హా ప‌లువురు సినీ ప‌రిశ్రమ‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 

రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి, మేఘా ఆకాశ్ జంట‌గా న‌టిస్తున్నారు. భ‌ర‌త్ కుమార్.పి ద‌ర్శ‌కుడు. గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. 

కాజ‌ల్ అగ‌ర్వాల్ మేనేజర్ రాన్స‌న్ జోసెఫ్‌ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నారు. ఆయ‌న‌తో క‌లిసి ఎన్‌.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఎమోష‌న‌ల్ ఇన్ టెన్స్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఫాలింగ్ ఇన్ ల‌వ్ ఈజ్ ఏ పెయిన్‌ఫుల్ జాయ్‌’ ట్యాగ్‌లైన్‌. డాలీ ధ‌నుంజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

న‌టీన‌టులు:

శివ కందుకూరి, మేఘా ఆకాశ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: భ‌ర‌త్ కుమార్‌.పి

స‌మ‌ర్ప‌ణ‌:  కాజ‌ల్ అగ‌ర్వాల్ 

నిర్మాత‌లు: ఎన్‌.శ్రీనివాస్ రెడ్డి, పి.రాన్స‌న్ జోసెఫ్‌

బ్యాన‌ర్‌: ఆపిల్ ట్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ:  రాహుల్ శ్రీవాత్స‌వ్‌

ఎడిట‌ర్‌:  ప్ర‌వీణ్ పూడి

ఆర్ట్‌: ఉపేంద్ర రెడ్డి

కాస్ట్యూమ్స్‌:  ఎస్‌.ఎస్‌.వాసు

ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌

ప‌బ్లిసిటీ డిజైన్‌:  అనీల్ భాను

పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్

Manu Charitra Movie Launched:

Kajal Aggarwal Presents ‘Manu Charitra’ starring Shiva Kandukuri and Megha Akash Film Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ