Advertisementt

‘ట్రాప్’ చేయడానికి త్వరలోనే వస్తున్నారు

Sat 11th May 2019 07:49 PM
trap movie,censor,completed,released  ‘ట్రాప్’ చేయడానికి త్వరలోనే వస్తున్నారు
Trap Movie Censor Completed ‘ట్రాప్’ చేయడానికి త్వరలోనే వస్తున్నారు
Advertisement
Ads by CJ

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న ‘ట్రాప్’ సినిమా..!!

బ్రహ్మాజీ, మహేంద్ర, షాలు, కాత్యాయని శర్మ, ముఖ్య పాత్రలలో నటించిన సినిమా ‘ట్రాప్’.. ప్రేమ కవితా లయ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆళ్ల స్వర్ణలత  నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్ అవుతుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది.. కాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆళ్ల స్వర్ణలత మాట్లాడుతూ.. ట్రాప్ చిత్రం కథ చాలా వెరైటీగా ఉంటుంది. దర్శకుడు ఫణీంద్ర చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమాని తెరకెక్కించాడు. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అన్నారు. 

దర్శకుడు ఫణీంద్ర మాట్లాడుతూ.. ట్రాప్ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోసిన హర్ష ప్రవీణ్ కి కృతఙ్ఞతలు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుంది అన్నారు. 

బ్రహ్మాజీ, మహేంద్ర, షాలు, కాత్యాయని శర్మ, ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాకి  నిర్మాత: ఆళ్ల స్వర్ణలత, ఎడిటర్: రామారావు జె పి, మ్యూజిక్: ఈశ్వర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : హర్ష ప్రవీణ్, కొరియోగ్రాఫర్ : జోజో, లిరిక్స్ : సాయిరాం తపస్వి, పి ఆర్ ఓ: సాయి సతీష్,  రచన , దర్శకత్వం : వీ ఎస్ ఫణీంద్ర.

Trap Movie Censor Completed:

Trap Movie Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ