Advertisementt

‘సువర్ణ సుందరి’ రెడీ అవుతోంది

Fri 10th May 2019 07:40 PM
purna,sakshi chaudhary suvarna sundari,movie,latest,update  ‘సువర్ణ సుందరి’ రెడీ అవుతోంది
Suvarna Sundari Ready to Censor ‘సువర్ణ సుందరి’ రెడీ అవుతోంది
Advertisement
Ads by CJ

పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద, ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాతోందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  రీతిలో ఓ సాంకేతికత అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్న  ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... సువర్ణ సుందరి  విఎఫ్ఎక్స్ కోసం ఏడాది పాటు వ‌ర్క్ జ‌రిగింది. ఔట్పుట్  అద్భుతంగా వ‌చ్చింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలలోనే గ్రాండ్ గా ఆడియోను విడుదల చేయనున్నాము.  పబ్లిసిటి పరంగా కూడా విభిన్నమైన ప్లానింగ్స్ తో ప్రమోట్ చేస్తున్నాము. మే 31 న సినిమాను విడుదల చేయనున్నామన్నారు. 

నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..‌  సువర్ణ సుందరి  చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. తెలుగు ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ నెలలోనే  ఆడియోను విడుదల చేయనున్నాము. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి  సన్నాహాలు చేస్తున్నామన్నారు. 

పూర్ణ‌, సాక్షి, జ‌య‌ప్ర‌ద‌, ఇంద్ర‌, రామ్ మద్దుకూరి, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి  మ్యూజిక్‌డైరెక్ట‌ర్: సాయికార్తిక్‌, స్టంట్స్:రామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు, డి.ఓ.పి: ఎల్లుమహంతి, ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి, స్టోరీ: ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, ప్రొడ్యూస‌ర్: ఎం.ఎల్‌.ల‌క్ష్మి, డైరెక్ట‌ర్: ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.

Suvarna Sundari Ready to Censor:

Suvarna Sundari Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ