Advertisementt

‘మహర్షి’ టాక్‌తో నిఖిల్ ధైర్యం చేస్తాడా?

Fri 10th May 2019 07:34 PM
nikhil,arjun suravaram,release date,maharshi,mahesh babu  ‘మహర్షి’ టాక్‌తో నిఖిల్ ధైర్యం చేస్తాడా?
Nikhil Thinking on Arjun Suravaram after Maharshi Result ‘మహర్షి’ టాక్‌తో నిఖిల్ ధైర్యం చేస్తాడా?
Advertisement
Ads by CJ

నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమా విషయంలో ఎంతగా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నప్పటికీ.. ఆ సినిమా విడుదల విషయంలో టోటల్ కన్ఫ్యూజన్‌లో ఉంటున్నాడు. ఎప్పటికపుడు సినిమా విడుదల అంటూ డేట్ ప్రకటించడం.. అనుకోకుండా పరిస్థితులు అనుకూలించడం లేదంటూ వెనక్కి వెళ్లిపోవడంతో.. ఆ సినిమా మీద అంచనాలు పడిపోతున్నాయి. మళ్ళీ తన ప్రమోషన్స్ తో సినిమా మీద అంచనాలు పెంచుతున్నాడు. ఏప్రిల్ నెలాఖరున విడుదల చేద్దామంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ కి భయపడి మే 17 కి వెళితే మహర్షి సునామీలో కొట్టుకుపోతానని మళ్ళీ వెనక్కి తగ్గినట్లే కనబడ్డాడు నిఖిల్.

అందుకే ప్రమోషన్స్ తగ్గించాడు. తాజాగా మహర్షి కి ఓ అన్నంత పాజిటివ్ టాక్ పడకుండా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మహర్షి‌తో పెట్టుకుని వారం తీరక్కుండా నిఖిల్ అర్జున్ సురవరం బాక్సాఫీసు వద్దకు వస్తే.. కష్టమే అనుకున్నారు. అందుకే సీత, కల్కి లాంటి సినిమాలు రెండు వారాల గ్యాప్ తో తమ సినిమా రిలీజ్ డేట్స్ ని ఎనౌన్స్ చేశాయి. మరి తాజాగా మహర్షి టాక్ తో మే 17న నిఖిల్ అర్జున్ సురవరాన్ని దింపితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ టాక్ తో మహర్షి వారానికే కలెక్షన్లు తగ్గుముకం పట్టే అవకాశం కనబడుతుంది. 

మహేష్ కి భయపడాల్సింది లేదని.. మహర్షి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు కాబట్టి తమ సినిమాలను దైర్యంగా విడుదల చేసుకోవచ్చని ఇప్పటికే మీడియం రేంజ్ నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అర్జున్ సురవరాన్ని మంచి ప్రమోషన్స్ తో ఈ మే 17న విడుదల చేయడానికి నిఖిల్ కి ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. చూద్దాం నిఖిల్ ఆలోచన ఎలా ఉందో.

Nikhil Thinking on Arjun Suravaram after Maharshi Result:

Nikhil Changed his Decision

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ