Advertisementt

‘డియర్ కామ్రేడ్’ కొడితే మళ్లీ రిపీట్..!

Fri 10th May 2019 06:37 PM
vijay deverakonda,hattrick,rashmika,dear comrade,geetha govindam  ‘డియర్ కామ్రేడ్’ కొడితే మళ్లీ రిపీట్..!
Again Rashmika and Vijay Deverakonda Combo ‘డియర్ కామ్రేడ్’ కొడితే మళ్లీ రిపీట్..!
Advertisement
Ads by CJ

గత ఏడాది రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ కలిసి నటించిన గీత గోవిందం సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో విజయ్ - రష్మికల జంట తెగ పాపులర్ అయ్యింది. ఇక రష్మిక నానితో కలిసి చేసిన దేవదాస్ ప్లాప్ అయినా... విజయ్ దేవరకొండ మాత్రం తన లక్కీ గర్ల్ రష్మిక మందన్నతో డియర్ కామ్రేడ్ సినిమా చేసాడు. విజయ్ - రష్మికల డియర్ కామ్రేడ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని... జులై 30న విడుదల అయ్యేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఇక డియర్ కామ్రేడ్ మీద మార్కెట్ లో భీభత్సమైన అంచనాలున్నాయి. హిట్ పెయిర్ మళ్లీ కలిసి నటించడం ఒక ఎత్తైతే... డియర్ కామ్రేడ్ లో రష్మిక - విజయ్‌ల రొమాంటిక్ సీన్స్‌కి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇక డియర్ కామ్రేడ్ టీజర్ లో రశ్మిక - విజయ్ ల లిప్ లాక్ చూస్తుంటే ఈజంట ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయమనేలా ఉంది.

మరీ ఈ సినిమా కనుక హిట్ అయితే ఈ జంట మరోమారు అంటే హ్యాట్రిక్ మూవీలో కలిసి నటించినా ఆశ్చర్యపోవక్కర్లేదంటూ వార్తలొస్తున్నాయి. రష్మిక - విజయ్ దేవరకొండ కాంబోలో మూడో మూవీ వస్తుందని అంటున్నారు. ఆనంద్ డైరెక్షన్‌లో తెలుగు, తమిళ భాషల్లో కారు రేసుల బ్యాగ్డ్రాప్ లో ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఢిల్లీ వెళ్లి మరీ కార్ రేస్ నేర్చుకున్నాడు కూడా.. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరోసారి రష్మికతో కలిసి నటించబోతున్నాడని.. డియర్ కామ్రేడ్ హిట్ అయితే పక్కాగా ఈ జంట ముచ్చటగా ఈ మూడో సినిమాలో జోడి కడుతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే రష్మిక.. విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా కోసం మరో బడా ఆఫర్‌ని తిరస్కరించినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి.

Again Rashmika and Vijay Deverakonda Combo:

Vijay Deverakonda and Rashmika Hat-Trick Movie confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ