ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ హవా కేవలం తెలుగు వారు ఉండే చోట మాత్రమే ఉండేది. దాంతో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారు బాలీవుడ్‌పై దృష్టి పెట్టి నేరుగా బాలీవుడ్‌లో చిత్రాలు తీశారు. నిజానికి మన స్టార్స్ పేర్లు తప్ప నాడు పెద్దగా సోషల్‌మీడియా లేనందున మన వారి స్టామినా మనకే పరిమితమై ఉండేది. దాంతో చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్‌కి ఇక్కడ తిరుగులేకపోయినా బాలీవుడ్‌లో పెద్దగా ఆదరణ సాధించలేకపోయారు. కేవలం మన అభిమానులు హంగామా చేయడం మినహా ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాదిలో కూడా మన స్టార్స్ చిత్రాలకు పెద్దగా హైప్ ఉండేది కాదు. ఇక ఇటీవల రామ్‌చరణ్ తొందరపడి మరీ ‘జంజీర్’ చేసి ‘తుఫాన్’లో కొట్టుకుపోయాడు. మహేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘స్పైడర్’ అదే ఫలితాన్ని ఇచ్చింది.
కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో తన వ్యూహచతురాత్మక చూపించాడు. తెలుగులోనే తీస్తూ ఇతర భాషల్లో కూడా సంచలనాలు నమోదు చేయవచ్చని ‘బాహుబలి’తో నిరూపించాడు. ఆయన తదుపరి చిత్రం కేవలం తెలుగుకే పరమితమైన స్టార్స్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ తీస్తూ అదే స్థాయి హైప్‌ని ఇప్పటి నుంచే క్రియేట్ చేస్తున్నాడు. ప్రభాస్ కూడా మెయిన్‌గా మన టాలీవుడ్‌నే టార్గెట్ చేస్తూ, ఇతరభాషా నటీనటులు, సాంకేతిక నిపుణులు, యూనివర్శల్ సబ్జెక్ట్స్‌తో ‘సాహో’ చేస్తున్నాడు. మరి ఈ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచిచూడాలి. ఇక అల్లుఅర్జున్‌కి కోలీవుడ్‌లో ఉన్న హవా తెలిసిందే. అయినా యూట్యూబ్‌లలో వచ్చే వ్యూస్‌ని బట్టి వాపుకి బలంగా అనుకోవడానికి వీలులేదు.
తాజాగా మహేష్ మాటల్లో ఇదే అర్ధం వచ్చేలా చెప్పాడు. బాలీవుడ్‌లో చిత్రాలు చేస్తారా? అని ప్రశ్నిస్తే ‘మనం ఈ విషయంలో రాజమౌళిని ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన ఇక్కడ సినిమాలు తీస్తూనే ఈ చిత్రాల ద్వారానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు అని తెలిపాడు. అంటే తెలుగులోనే సినిమా తీసి డబ్ రూపంలో అయినా సరే బయటి భాషల్లో హిట్ కొట్టాలే గానీ దాని కోసమని బాలీవుడ్, కోలీవుడ్‌లకు డైరెక్ట్‌గా వెళ్లాల్సిన పని లేదని దాని అంతరార్థంగా కనిపిస్తోంది. మరి మహేష్, రాజమౌళితో చేసే చిత్రంతోనైనా అది చేసి చూపిస్తాడా? అనేది వేచిచూడాలి....!