మహేష్ బాబు కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే 25 వ సినిమా మహర్షి నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులముందుకు వచ్చింది. వంశి పైడిపల్లి డైరెక్షన్ లో ముగ్గురు బడా నిర్మాతలు నిరించిన మహర్షి మూవీ అక్కడక్కడా మిక్స్డ్ టాక్ అక్కడక్కడా పాజిటివ్ టాక్ వినబడుతుంది. వంశి పైడిపల్లి మహర్షి సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించాడని అంటున్నారు. మరి భారీ అంచనాలతో భారీగా విడుదలైన మహర్షి సినిమాలో మహేష్ నటన అద్భుతమంటున్నారు ప్రేక్షకులు. హీరోయిన్ పూజా హెగ్డే గ్లామర్ డాల్ గా సెక్సీ గా ఉందని... సాంగ్స్ లో పూజా గ్లామర్ బావుందని అంటున్నారు.
ఇక అల్లరి నరేష్ రవి పాత్రలో అద్భుతంగా నటించాడని... గతంలో గమ్యం సినిమాలో గాలి శీను పాత్రకి ఎంతగా పేరొచ్చిందో.. మహర్షిలో రవి పాత్రకి అంతగా పేరొస్తుందని.. ఇలాంటి సపోర్టింగ్ కేరెక్టర్స్ కి ఇక అల్లరి నరేష్ పేరు పరిశీలించడం ఖాయమంటున్నారు. ఇక దేవిశ్రీ మ్యూజిక్ కి ప్రేక్షకులు అంతగా ఇన్వాల్వ్ కాకపోయినా.. నెమ్మదిగా పాటలు కనెక్ట్ అవుతాయని... సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉందని అంటున్నారు.
కాకపోతే మహర్షి నిడివి ప్రేక్షకులను బోర్ కొట్టిస్తుంది.. అలాగే సెకండ్ హాఫ్ లో మహేష్ ఎమోషనల్ సీన్స్ కదిలించాయని.. మహేష్ స్టూడెండ్ గా కాలేజ్ సన్నివేశాలు, మహేష్ రైతుగా, సీఈవోగా సూపర్ స్టైలిష్ గా కనిపించాడని అంటున్నారు. ఇక వంశి పైడిపల్లి నిర్మాతలచే ఎంతగా ఖర్చు పెట్టించాడో.. ఆ రిచ్ నెస్ మొత్తం స్క్రీన్ మీద కనబడుతుందని అంటున్నారు. మరి మహర్షి మీద ప్రేక్షకుల టాక్ ఇలా ఉంటే.. క్రిటిక్స్ టాక్ ఎలా వుందో మరికాసేపట్లో...