ప్రపంచం కుగ్రామంగా మారుతోంది. మన తెలుగు పల్లెటూర్ల నుంచి కూడా యువత అమెరికా వెళ్తున్నారు. ప్రత్యేక తెలంగాణ సమయంలో మన ఉద్యోగాలు మనకే అని తెలంగాణ నాయకులు ప్రజల్లో సెంటిమెంట్ రాజేశారు. ప్రత్యేక తెలంగాణ కోరడంలో తప్పు లేదు గానీ మన ఉద్యోగాలు మనకే అనడం మాత్రం తప్పు. అలా అనుకుంటే అమెరికా వారి ఉద్యోగాలు వారికే చెందాలి. అంతేగానీ భారతీయులు సొంతం చేసుకుంటుంటే వారికి మాత్రం కడుపు మండదా?
ఇక విషయానికి వస్తే మన నెటిజన్లు మరీ శృతిమించుతున్నారు. ఉదాహరణకు బాలీవుడ్‌స్టార్ అక్షయ్‌కుమార్‌కి స్టార్‌గానే కాదు.. సరిహద్దులో మరణించిన, నక్సలైట్ల బాంబు పేలుళ్లలో మరణించిన వారి పిల్లలను కూడా దత్తత తీసుకుని వారిని పోషిస్తున్నాడు. తమిళనాడు, కేరళ.. ఇలా ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ముందుగా స్పందించి భారీ విరాళాలు ఇవ్వడంలో అక్షయ్ ముందుంటాడు. బిల్‌గేట్స్ నుంచి ఎందరో మన దేశంలోని పేదలకు సాయం చేస్తున్నారు. స్వయాన మదర్‌థెరిస్సా మన దేశానికి చేసిన సేవ ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఆమెని కూడా మతవార్పిడుల కోసమే ఇలా చేస్తోందని విమర్శించేవారు లేకపోలేదు.
ఇక సల్మాన్, అమీర్, షారుఖ్‌ఖాన్‌లలైతే భారతదేశంలో అసహనం పెరుగుతోందని విదేశాలలో స్ధిరపడదామని తమ వారు పట్టుబడుతున్నారని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఇలాంటి వారిని విమర్శించిడంలో తప్పు లేదు గానీ కేవలం భారత పౌరసత్వం లేని కారణంగా అక్షయ్‌కుమార్‌ని నెటిజన్లు ట్రోల్‌చేయడం దారుణం. అది వ్యక్తిగత విషయం. పౌరసత్వం వంటివి సాంకేతిక అంశాలే గానీ అవే దేశభక్తికి దిక్సూచిలు కావు. ఇక తనను విమర్శిస్తున్న వారికి ఖిలడి అక్షయ్‌కుమార్ చేతల ద్వారా సమాధానం చెప్పాడు. ఒడిస్సాని ముంచెత్తిన ఫణి తుఫాన్ బాధితులకు ఆయన కోటిరూపాయల విరాళం ప్రకటించాడు. మరి దీనికి అక్షయని తప్పుపట్టేవారు ఏం సమాధానం చెబుతారో చూడాలి...! కోడిగుడ్డుకి ఈకలు పీకడం మానుకోవాలి..!