Advertisementt

‘మహర్షి’.. ‘కల్కి’కి కూడా ఛాన్సిచ్చాడు

Thu 09th May 2019 01:32 PM
rajasekhar,kalki,commercial trailer,release,maharshi  ‘మహర్షి’.. ‘కల్కి’కి కూడా ఛాన్సిచ్చాడు
‘Maharshi’ Gives Chance to Kalki ‘మహర్షి’.. ‘కల్కి’కి కూడా ఛాన్సిచ్చాడు
Advertisement
Ads by CJ

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం (మే 9న) విడుదలవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాతో ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... ‘‘ఇప్పటికే విడుదలైన రాజశేఖర్ గారి ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ కు అద్భుత స్పందన లభించింది. నా నుంచి రాబోతున్న ఈ సినిమా కమర్షియల్ గా ఉంటూ కొత్తగా ఉంటుంది. ‘కల్కి’ ఎంత కొత్తగా ఉండబోతుంది అనేది టీజర్ లో చూపించే ప్రయత్నం చేశాం. ఎంత కొత్తగా ఉంటుందనేది కమర్షియల్ ట్రైలర్ లో చూపించాం. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య, అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మహేష్ బాబు గారి ‘మహర్షి’తో మా సినిమా కమర్షియల్ ట్రైలర్ విడుదల అవుతుండడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులందరూ ట్రైలర్ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఇది కమర్షియల్ ట్రైలర్ మాత్రమే. సినిమా విడుదలకు ముందు ‘కల్కి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు.

అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. 

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

‘Maharshi’ Gives Chance to Kalki:

‘Kalki’ commercial trailer with ‘Maharshi’ 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ