మే 10 న లవ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ ‘యురేక’ టీజర్ విడుదల
ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్ ని ఈనెల 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లవ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా, చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
కార్తీక్ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్ హయతి, సమీక్ష, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ, ఆర్.కె,వేణుగోపాల్ రావు, కోటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఆనంద్, నిర్మాత: ప్రశాంత్ తాత, సహా నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్: అవినాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం: రామాంజనేయులు పి.ఆర్.ఓ: సాయి సతీష్.