చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సై రా నరసింహారెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. గత రెండేళ్లుగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండియా వైడ్‌గా భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా అదరగొట్టేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చిరు సై రా లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక చిరుకి జోడిగా నయనతార నటిస్తున్నఈ సినిమాలో మరో హీరోయిన్ తమన్నా కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో నయనతార.. చిరు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య పాత్రలో కనిపిస్తుంది అనేది.. అప్పుడెప్పుడో లీకైన సైరా స్టిల్స్ లో చూసాం. అయితే తమన్నా రోల్ పై ఎలాంటి క్లూ కానీ క్లారిటీ కానీ లేదు.
తాజాగా సై రా లో తమన్నా పోషిస్తున్న పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమన్నా.. సై రాలో ఓ రాణిగా నటిస్తోందని.. పైగా తమన్నా పోషిస్తోన్న పాత్రకు కాస్త నెగిటివ్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి తమన్నా పుట్టినరోజుకి సై రా బృందం వదిలిన లుక్ లో తమన్నా చాలా పద్దతిగా సాంప్రదాయ వస్త్రధారణలో మరియు అలంకరణలతో కనిపించింది. మరి ఇప్పుడు చూస్తుంటే తమన్నా పాత్రకి నెగెటివ్ షేడ్స్ ఉంటాయంటున్నారు. మరి తమన్నా సై రా లో విలన్ గా ఎలాంటి అరాచకాలు చేస్తుందో అనేది తెలియాలంటే సై రా విడుదల వరకు వెయిట్ చేయక తప్పదు.