సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం బడ్జెట్ 110 నుంచి 120కోట్ల వరకు చేరిందని స్వయంగా మహేష్ ఒప్పుకున్నాడు. మంచి కథ అనుకున్నప్పుడు రాజీపడకుండా అవసరమైన విధంగా బడ్జెట్‌ని పెట్టడానికి వెనుకాడకూడదని ఆయన చెబుతూ, అమెరికాలో సీఈవో అంటే మామూలుగా ఉండకూడదు. హెలికాప్టర్లు, ఖరీదైన కార్లు, బంగళాలు ఉండాల్సిందే. ఇక కొన్ని సన్నివేశాలను సెట్స్ వేసి రోజుకి వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో సన్నివేశాలను చిత్రీకరించామని, కానీ అది చలికాలం కావడంతో సాయంత్రం ఐదు గంటలకే వెలుతురు తగ్గడంతో వాటి చిత్రీకరణ కూడా ఆలస్యమైందని పలు వాస్తవాలను ఆయన ఒప్పుకున్నాడు.
ఇక చిత్ర నిర్మాణంలో ఎంత సీనియర్ అయినప్పటికీ అశ్వనీదత్‌కి ఎప్పుడు బడ్జెట్‌పై కంట్రోల్ ఉండేది కాదు. ఆయన చిత్రాలన్నీ అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇక పివిపి కొత్తవాడే కాదు.. ఈయనకు కూడా బడ్జెట్ కంట్రోల్‌పై సరైన పట్టు లేదని ఆయన తీసిన ‘ఊపిరి, బ్రహ్మోత్సవం’ వంటివి నిరూపించాయి. కానీ బడ్జెట్‌ని కంట్రోల్ చేయడంలో దిల్‌రాజు దిట్ట. ఆయన సరైన సమయానికి చిత్రాలను పూర్తి చేసేలా చూసుకోవడంతో పాటు అనుకున్న బడ్జెట్‌కి సినిమా మంచి అవుట్‌పుట్‌తో బయటకు వచ్చేలా చేయడంలో నేర్పరి. మరి ఈ చిత్రం విషయంలో మాత్రం దిల్‌రాజు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడని అంటున్నారు.
ఇక ఈ బడ్జెట్ ఇంతలా పెరగడానికి దర్శకుడు వంశీపైడిపల్లి ముఖ్యకారణం. ఆయన తీసిన పలు చిత్రాలు ఇలాగే ఓవర్ బడ్జెట్ కారణంగా కాస్ట్ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ‘మున్నా’ నుంచి ‘ఊపిరి’ వరకు ప్రతి చిత్రం విషయంలో ఇదే జరిగింది. ఇక వంశీపైడిపల్లి దిల్‌రాజు కాంపౌండ్ నుంచి దర్శకునిగా మారిన వ్యక్తి. మరి అలాంటి దర్శకుడిని బడ్జెట్ విషయంలో కంట్రోల్‌లో ఉంచడంలో దిల్‌రాజు కూడా మొదటిసారి ఫెయిల్ అయ్యాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి ‘మహర్షి’ చిత్రం బ్లాక్‌బస్టర్ అనిపించుకోవాలంటే కనీసం ఈ చిత్రం 150కోట్లను వసూలు చేయకతప్పని పరిస్థితి. మరి దీనిని మహేష్ అండ్ కో రీచ్ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది.....!