Advertisementt

ఫార్ములాకు భిన్నంగా వెళ్తున్న బన్నీ?

Mon 06th May 2019 10:37 AM
sukumar,allu arjun,next film,launch,may 11  ఫార్ములాకు భిన్నంగా వెళ్తున్న బన్నీ?
Sukumar and Allu Arjun Film Launching date Out ఫార్ములాకు భిన్నంగా వెళ్తున్న బన్నీ?
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ తరువాత సరైన స్క్రిప్ట్ అండ్ సరైన డైరెక్టర్ కోసం ఇంతకాలం వెయిట్ చేసాడు. బన్నీ ఫ్యాన్స్ కూడా బన్నీ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి తన సినిమా విషయంలో లేట్ అవ్వకూడదని డిసైడ్ అయి వరసగా మూడు సినిమాలని సెట్స్ మీదకు తీసుకుని వెళ్తున్నాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ఇంకా ఫస్ట్ షెడ్యూల్ ఇలా కంప్లీట్ అయిందో లేదో, అప్పుడే మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు బన్నీ.

అవును బన్నీ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ ఓ సినిమా చేస్తున్నట్టు అధికారంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 11న ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఒక 50శాతం కంప్లీట్ అయిన వెంటనే, సుకుమార్ సినిమాకు షిఫ్ట్ అవ్వబోతున్నాడు.

అలానే దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాను కూడా ఫాలో అవ్వబోతున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ బన్నీ ‘ఐకాన్’ అనే మూవీ చేస్తున్నాడు ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ మూవీ సెట్స్ పై ఉంటుండగానే స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక సినిమాల సక్సెసులు ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యాడట బన్నీ. బన్నీకి నిజంగా ఇలాంటివి కొత్త. ఒక సినిమా కంప్లీట్ అయిన తరువాత మరో సినిమా స్టార్ట్ చేసే బన్నీ ఈసారి ఆ ఫార్ములాకు భిన్నంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

Sukumar and Allu Arjun Film Launching date Out:

Allu Arjun Next Film Started from May 11

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ