మే 24న విడుదలవుతోన్న బెల్లంకొండ శ్రీనివాస్ ‘సీత’
యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. వీరిద్దరూ జంటగా రెండోసారి నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 24న విడుదలవుతుంది. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రేక్షకుల నుండి ఈ స్పెషల్ సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త షేడ్‌లో కనపడుతున్నాడని అప్రిసియేషన్స్ వచ్చాయి. అనీల్ సుంకర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు:
బెల్లంకొండ శ్రీనివాస్
కాజల్ అగర్వాల్
మన్నారా చోప్రా
సోనూ సూద్
తనికెళ్ల భరణి
అభినవ్ గోమటం
అభిమన్యుసింగ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: తేజ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్
సమర్పణ: ఏ టీవీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రపీ: శిర్షా రే
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: కనల్ కణ్ణన్
డైలాగ్స్: లక్ష్మీ భూపాల్
పబ్లిసిటీ ఇన్‌చార్జ్: విశ్వ సి.ఎం
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్