తమిళంలో హిట్టయిన ‘జిగర్తాండ’ని తెలుగులో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈసినిమాకు ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ మురళి కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా గురించి, డైరెక్ట్ హరీష్ శంకర్ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ తాజాగా ట్విట్టర్ ద్వారా హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.
‘వాల్మీకి’ తరువాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ చేయబోతున్నట్టుగా, దీనికోసం రీసెంట్‌గా చర్చలు కూడా జరిగాయన్న వార్తనూ తోసిపుచ్చాడు హరీష్. ఇందులో ఏమాత్రం నిజంలేదని ఆయన తెలిపాడు. తన నుండి కానీ లేదా ప్రొడక్షన్ హౌస్ నుండి కానీ ఏదైనా అఫీషియల్ న్యూస్ వస్తేనే నమ్మాలని కోరాడు.
అలాగే ‘వాల్మీకి’ మూవీలో హీరోయిన్ పూజాహెగ్డేకు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే వార్తను కూడా హరీష్ కొట్టిపారేశాడు. ఈ రెండు విషయాల గురించి క్లారిటీ ఇవ్వదలుచుకున్నానంటూ హరీష్ తన ట్విట్టర్‌లో ఈ విధంగా తెలిపాడు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెబుతామని, అప్పటి వరకు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయవద్దని ఆయన పేర్కొన్నాడు.