Advertisementt

ఓ సినీజంట పెళ్లికి నిత్యామీననే కారణం.. అదెలా?

Sat 04th May 2019 07:50 PM
nithya menon,nazriya nazim marriage,heroine,nithya menon interview,secret  ఓ సినీజంట పెళ్లికి నిత్యామీననే కారణం.. అదెలా?
Nithya Menon Reveals A Top Secret ఓ సినీజంట పెళ్లికి నిత్యామీననే కారణం.. అదెలా?
Advertisement
Ads by CJ

టాలెంట్ ఉండి కూడా యాటిట్యూడ్ కారణంగా సినిమాలు చేజార్చుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వారిలో సాయిపల్లవితో పాటు నిత్యామీనన్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరిన నిత్యామీనన్.. సడెన్‌గా సినిమాలు తగ్గించి, ఈ మధ్య అసలు కనిపించడమే కరువైంది. ఇక ఈ భామ షూటింగ్‌కు టైమ్‌కు రాకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతుండటంతో మలయాళంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అక్కడి నిర్మాతలు ఆమెను బ్యాన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారంటే ఎంతగా ఆమె ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్ వల్లే అలా జరుగుతుందని క్లారిటీ ఇచ్చినా.. కరిగిపోయే నిర్మాతలు లేరక్కడ.

సరే ఆ విషయాలు పక్కన పెడితే.. ఈ భామ స్వయంగా ఓ సినీ జంట పెళ్లికి కారణమైందనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తను చేయాలనుకున్న ఓ మూవీకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, వేరే హీరోయిన్‌ ఆ మూవీకి సెలక్ట్ అయిందట. ఆ హీరోయిన్, ఆ మూవీ నిర్మాత.. ఆ తర్వాత ప్రేమించుకుని, పెళ్లి కూడా చేసుకున్నారట. ఇంతకీ వారెవరో తెలుసా? ‘రాజారాణి’ ఫేమ్ నజ్రియా నజ్రీమ్ మరియు ఫాహద్ ఫాజిల్. సినిమా పేరు ‘బెంగళూర్ డేస్’. ఈ విషయాన్ని స్వయంగా నిత్యామీననే ఇటీవల ఓ ఇంటర్య్వూలో తెలిపింది.  

‘‘ముందుగా ‘బెంగ‌ళూరు డేస్‌’ చిత్రంలో నాకే ఆఫర్ వచ్చింది. వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. ఆ తర్వాత నా స్థానంలో నజ్రియాను ఆ పాత్రకు తీసుకున్నారు. ఆ మూవీ టైమ్‌లోనే నజ్రియా, ఫాహద్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. వారిద్దరూ ఎక్కడ కలిసినా.. ‘మీరే మా పెళ్లికి కారణం’ అని చెబుతారు. నా వల్ల ఓ జంట హ్యాపీగా ఉన్నారనే ఫీలింగ్.. నాకు ఎంతగానో సంతోషాన్నిస్తుంది..’’ అంటూ నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.

Nithya Menon Reveals A Top Secret:

Nithya Menon is Reason for Nazriya Nazim Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ