Advertisementt

స్టార్ నటుడ్ని బ్యాన్ చేసినా బిజీబిజీనే!

Fri 03rd May 2019 11:26 PM
nana patekar,allu arjun,rana,trivikram srinivas,bollywood,ban,tollywood  స్టార్ నటుడ్ని బ్యాన్ చేసినా బిజీబిజీనే!
Bollywood Actor Busy in South స్టార్ నటుడ్ని బ్యాన్ చేసినా బిజీబిజీనే!
Advertisement
Ads by CJ
  • బాలీవుడ్‌లో బ్యాన్... సౌత్‌లో రెడ్ కార్పెట్
  • మీటూ ఆరోపణలతో బాలీవుడ్‌లో బ్యాన్
  • టాలీవుడ్, కోలీవుడ్‌లలో రెండేసి సినిమాలు

బాలీవుడ్‌లో నటుడు నానా పాటేకర్‌ని దాదాపుగా బ్యాన్ చేసినట్టే. తనుశ్రీ దత్తా చేసిన మీటూ ఆరోపణలతో నానా పాటేకర్‌తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు మొగ్గు చూపడం లేదు. ఇక నానా పాటేకర్ చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయ్యాక ఆయన్ని తప్పించిన విషయం తెలిసిందే. మరి బాలీవుడ్‌లో బ్యాన్ చేస్తే ఏమిటి.. సౌత్‌లో మాత్రం ఈ విలక్షణ నటుడికి రెడ్ కార్పెట్ పడుతున్నారు. నానా పాటేకర్ నటనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే సౌత్ దర్శకులు నానా పాటేకర్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆయనకు ప్రత్యేకమైన పాత్రలను డిజైన్ చేస్తున్నారు. 

టాలీవుడ్‌లో నానా పాటేకర్‌కి అల్లు అర్జున్ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ ఒక మంచి బలమైన్ క్యారెక్టర్ రాశాడట. త్రివిక్రమ్.. నానా పాటేకర్ పాత్రని అల్లు అర్జున్ సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేసాడని అంటున్నారు. ఇక రానా - సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విరాట పర్వం సినిమాలోనూ నానా పాటేకర్ నటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. 

ఎలాంటి ఎమోషన్ అయినా, ఎంత కఠినమైన డైలాగ్ అయినా కేవలం తన నటనతో తన మాడ్యులేషన్‌తో వాటిని మరో స్థాయికి తీసుకెళ్లి ఇంకా అద్భుతంగా చూపించగల సత్తా ఉన్న నటుడు ఆయన. మరి తెలుగులోనే కాదు.... నానా పాటేకర్ తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తున్నాడు. గతంలో రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమా కాలాలో నానా పాటేకర్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

Bollywood Actor Busy in South:

Nana Patekar in Allu Arjun and Rana movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ