Advertisementt

డ్రంక్ అండ్ డ్రైవ్: స్టార్ హీరోయిన్ తప్పించుకుంది!

Fri 03rd May 2019 07:22 PM
tollywood,star heroine,escaped,drunk and drive,hyderabad,  డ్రంక్ అండ్ డ్రైవ్: స్టార్ హీరోయిన్ తప్పించుకుంది!
Star Heroine Missed From Drunk and Drive Case డ్రంక్ అండ్ డ్రైవ్: స్టార్ హీరోయిన్ తప్పించుకుంది!
Advertisement
Ads by CJ
  • వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న హీరోయిన్
  • డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మిస్సయిన స్టార్ హీరోయిన్
  • తన చిత్ర ఈవెంట్ నుంచి వెళ్లే ముందు బార్‌లో సిట్టింగ్

ఇటీవల హైదరాబాద్‌ నగర నడిబొడ్డున జరిగిన ఓ స్టార్ హీరో మూవీ వేడుక చాలా గ్రాండ్‌గా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ‌ నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ వేడుకలో చిత్ర హీరోయిన్ కూడా కళ్లు చెదిరే డ్రస్‌తో దర్శనమిచ్చి అందరినీ అలరించింది. అందరి కళ్ళు తన మీదే ఉండేలా డ్రెస్ వేసుకుని క్యూట్ లుక్స్ తో అదరగొట్టేసిన ఆ స్టార్ హీరోయిన్‌పైనే అందరి కళ్లు పడ్డాయి అంటే ఎంతగా ఆమె ఆ డిజైనర్ డ్రెస్‌లో మెరిసిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈవెంట్ అయిన అనంతరం ఈ భామ చేసిన పనే ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. 

ఇంతకీ విషయం ఏమిటంటే సదరు ఈవెంట్ ముగిశాక గెస్ట్‌లు, చిత్ర యూనిట్ కామ్ గా కారెక్కి ఇంటికెళ్ళిపోగా.. హీరోయిన్ మాత్రం తన మేనేజర్‌తో కలిసి దగ్గర్లోని ఒక స్టార్ హోటల్‌కెళ్ళి బార్లో సిట్టింగ్ వేసిందట. దాదాపు అర్థరాత్రయ్యాక.. రిటర్న్ జర్నీ కోసం రోడ్డెక్కిందని... రోడ్ మీదకొచ్చిన హీరోయిన్ కారు... అక్కడే దగ్గర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీస్‌లకు చిక్కిందని... కానీ డ్రైవింగ్ సీట్లో హీరోయిన్ మేనేజర్ ఉండడంతో తృటిలో ఆ భామ తప్పించుకుందనే వార్తలొస్తున్నాయి. 

ఇక తన మేనేజర్‌ని కారుని పోలీస్‌లకు అప్పజెప్పి... తన టీంతో కలిసి మరో కారులో అక్కడనుండి తప్పించుకుందట. ఇక అక్కడ దగ్గర్లో సిసీ కెమెరాస్ కూడా లేకపోవడంతో ఈ హీరోయిన్ వ్వవహారం మీడియాకి చిక్కలేదని.. లేదంటే మీడియాలో ఆమెని ఆడుకునేవారని అంటున్నారు. మరి కాస్త లేట్ గా బయటికొచ్చిన ఈ స్టార్ హీరోయిన్ వ్యవహారం ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. 

Star Heroine Missed From Drunk and Drive Case:

Tollywood Top Heroine Escaped in Drunk and Drive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ