ఎంతమంచి చిత్రమైనా సోలోగా రెండు మూడు వారాలు మరో సినిమా రాకుండా చూసుకుంటేనే లాభాలు వస్తున్నాయి. అంతేకాదు.. మనకి ఒకేసారి రెండు మూడు చిత్రాలను కూడా భరించే సత్తా ఉందని మాట్లాడితే చేసేది ఏమీ లేదు. కొంతకాలం కిందట, నితిన్ ‘లై’, బోయపాటి శ్రీను-బెల్లంకొండ సాయిసురేష్ ‘జయజానకి నాయకా’, రానా -సురేష్‌బాబు-తేజల ‘నేనే రాజు నేనేమంత్రి’ చిత్రాలు విడుదల అయ్యాయి. జయజానకి నాయకాకి, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. లై చిత్రానికి కూడా విభిన్నచిత్రంగా పేరు వచ్చినా ఆడేలేదు. అలా మూడు మంచి చిత్రాలు ఒకేసారి రాడటం వల్ల నేనే రాజు నేనే మంత్రి చిత్రం మాత్రమే కమర్షియల్ హిట్ కాగా, మిగిలిన రెండు చిత్రాలు బాగున్నాకూడా ఆడలేదు.
ప్రస్తుతం ‘మజిలీ, చిత్రలహరి, జెర్సీ’లతో పాటు ‘అవేంజర్స్’ దెబ్బకి మంచి తెలుగు చిత్రాలకు కలెక్షన్లు రావడం లేదు. కాగా ఈనెల 17వ తేదీన ఒకేరోజు నిఖిల్ ‘అర్జున్ సురవరం’, అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ విడుదలకు పోటీ పడుతున్నాయి. వాస్తవానికి అల్లు శిరీష్‌కి మంచి హిట్ ట్రాక్‌లేదు. ఆయన కెరీర్‌లో ‘శ్రీరస్తు..శుభమస్తు’ ఒక్కటే యావరేజ్ చిత్రం. ఇక ఈ ‘ఎబిసిడి’ విషయానికి వస్తే ఈ మూవీ మలయాళంలో ‘దుల్కర్‌సల్మాన్’ నటించిన మూవీకి రీమేక్. ఇక ‘అర్జున్ సురవరం’ విషయానికి వస్తే ఇది తమిళ ‘కణిథన్’కి రీమేక్. నిజానికి అల్లు శిరీష్ కంటే నిఖిల్‌కే ఫాలోయింగ్, మార్కెట్, బిజినెస్ ఎక్కువ. ఈ విధంగా పైచేయి ‘అర్జున్ సురవరం’ దే అవుతుంది.
ఇక ఇంతకాలం అల్లుశిరీష్‌కి హిట్ ఇవ్వాలని కలలు కన్న ఆయన తండ్రి, సుప్రసిద్ద నిర్మాత అల్లుఅరవింద్ ఈ ‘ఎబిసిడి’ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేయనుంది. ఇలా ఇద్దరు అగ్రనిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్‌బాబులు కలిశారంటే ఆటోమాటిగ్గా క్రేజ్ వస్తుంది. ఇక నిఖిల్ మాత్రం తన సినిమా కంటెంట్... తనదైన విభిన్న చిత్రాల పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాడు. మరి మే 17న ఈ ఇద్దరు యువహీరోలలో ఎవరు ముందుంటారో? వేచిచూడాలి. అందునా ఈ రెండు చిత్రాలకు భారీ నిర్మాతల పుణ్యమా అని థియేటర్లకు మాత్రం డోకా లేదు.