Advertisementt

జనసేనాని మరలా సినిమాలలోకి వస్తాడా?

Fri 03rd May 2019 08:26 AM
pawan kalyan,janasena party,re entry,movies  జనసేనాని మరలా సినిమాలలోకి వస్తాడా?
Rumours on Pawan Kalyan Re Entry జనసేనాని మరలా సినిమాలలోకి వస్తాడా?
Advertisement
Ads by CJ

జనసేనాని మరలా సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నాడా? లేదా? అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. పవన్‌ ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్ధులను నిర్ణయించుకుని పోటీకి దిగాడు. ఆయనతో వామపక్షాలు, బహుజనసమాజ్‌ వాదీ పార్టీలతో కూటమిగా ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగాడు. మరోవైపు ఎన్నికలు మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే వంటి రెండు స్థానాలకు పోటీ చేశాడు. ఈనెల 23న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ రోజున టిడిపి, వైసీపీలతో పాటు పవన్‌కళ్యాణ్‌ జనసేన పరిస్థితి కూడా అర్ధమవుతుంది. ఈ ఎన్నికల్లో అయన మెజార్టీ స్థానాలలో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడనే ఆశలు లేవు. సింగిల్‌ డిజిట్‌కే జనసేన పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మే 23వ తేదీ తర్వాత అసెంబ్లీలో హంగ్‌ వస్తే పవన్‌ పాత్ర కీలకం అవుతుంది. 

పవన్‌ ఈ విషయంలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌, బిజెపిల స్థానాలకు ఏమాత్రం సరిపడని కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు. అలా తాను కూడా ఏపీలో కీలకపాత్రను పోషిస్తున్నానని ఆయన కలలు కంటున్నారు. ఇక పవన్‌ తాను కేవలం ఒకే ఎన్నికల కోసం పార్టీ పెట్టలేదని, 25ఏళ్ల సుదీర్ఘ లక్ష్యంతో వచ్చానని, గెలిస్తే సరే.. ఓడిపోతే తనని విడిచి వెళ్లేవారికి నా పార్టీలో స్థానం లేదని తేల్చిచెప్పాడు. ఇదే సమయంలో పవన్‌కి ‘అజ్ఞాతవాసి’నే చివరి చిత్రమని ఎన్నికల తర్వాత జయాపజయాలను పరిశీలించి, విశ్లేషించిన తర్వాతే పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతాడా? లేక ఐదేళ్లు చేసే పని ఏమీ లేదు కాబట్టి మరలా సినిమాలపై దృష్టి పెడతాడా? అనేది ఉత్కంఠను కలిగిస్తోంది. 

నిజానికి ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఆయన మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థలో, ఎ.యం.రత్నం, దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ వంటి వారితో కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి... అని మొన్నటి ఎన్నికల వేడి పవన్‌ ఆ అడ్వాన్స్‌లను నిర్మాతలకు ఇచ్చేశాడని సమాచారం. మొత్తానికి ఎన్నికల తర్వాత పవన్‌ సినిమాలు చేయడం గ్యారంటీ అనే అంటున్నారు. అందుకే చాలామంది రచయితలు, డైరెక్టర్లు పవన్‌ కోసం కథలను వండివార్చడంలో బిజీబిజీగా ఉన్నారు. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే కొంత కాలం వెయిట్‌ చేయ్యాల్సిందే. ఇక పవన్‌ వీరాభిమానులు ఎన్నికల్లో పవన్‌ గెలిసే ఆనందపడతారు. అయితే రాజకీయాలలో పెద్దగా రాణించలేకపోతే మరలా ఆయన వెండితెరపై కనిపించి అభిమానులను ఆనందంలో ముంచెత్తడం ఖాయమని చెప్పాలి. 

Rumours on Pawan Kalyan Re Entry:

Pawan Kalyan Re Enters Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ