సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా, ‘మహర్షి’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన మహేష్ అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మహర్షి’ థియేట్రికల్ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్, కామన్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఆడియో సీడీలను విక్టరీ వెంకటేష్, విజయ్‌దేవరకొండ, కొరటాలశివ సంయుక్తంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘సూపర్‌స్టార్ అభిమానులకు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కావాలని ఉందో అంత పెద్ద కోరిక మే 9న తీరబోతుంది. మహేష్‌గారి 25వ చిత్రాన్ని మూడు బ్యానర్స్ నిర్మాతలం కలిపి చేశాం. మే 9న అద్భుతమైన సినిమా ఇస్తున్నామని నమ్మకంతో ఉన్నాం. ట్రైలర్ చూసిన తర్వాత అందరూ బ్లాక్ బస్టర్ కొట్టారని మెసేజ్‌లు వస్తున్నాయి. ఒక్కొక్క టెక్నీషియన్‌తో వంశీగారు చేసిన ట్రావెల్ గొప్పది. సినిమాటోగ్రాఫర్ మోహనన్‌గారికి థ్యాంక్స్. దేవిశ్రీ గురించి చెప్పాలంటే ఈ సినిమా కోసం ఏడాదిన్నరగా ట్రావెల్ చేస్తున్నాడు. సాధారణంగా ఆరు పాటలుంటాయి. కానీ ఈ సినిమాలో రెండు డ్యూయెట్స్ నాలుగు మాంటేజ్ సాంగ్‌లుంటాయి. అంటే ఎంత పెద్ద కథో అర్థం చేసుకోవచ్చు. రేపు సినిమా చూసేటప్పుడు విజువల్స్‌ను ఎంజాయ్ చేస్తారు. రేపు థియేటర్స్‌లో ఆల్బమ్ మారుమ్రోగిపోతుంది. అది మా గ్యారంటీ. వంశీ, హరి, సాల్మన్ కారణంగానే ఈ కథ పుట్టింది. వంశీ పక్కనే వాళ్లు ఉండి ఎంతగానో సపోర్ట్ అందించారు. రేపు సినిమా రిలీజ్ తర్వాత అందరూ కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు. అల్లరి నరేష్‌గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. వంశీ ఏడాదిన్నర పాటు మహేష్‌గారితో ట్రావెల్ అయ్యి ఈ సినిమా చేశాడు. వంశీకెరీర్‌కే మైలురాయిలాంటి సినిమా. మొన్న సినిమా చూపించాడు. సినిమా చూసే సమయంలో ఓ దణ్ణం పెట్టేసే దాన్ని వాట్సాప్‌లో పంపేశాను. ఇక క్లైమాక్స్ చూడగానే.. కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒక సినిమా జర్నీలో ఎందరినో కలుస్తాం. ఆ జర్నీలో అందరికీ ఓ అద్భుతమైన ట్రావెల్ ఉంటుంది. దత్తుగారు, పివిపిగారితో కలిసి పనిచేయడం గొప్ప అవకాశం. మే 9న ..రాసి పెట్టుకోండి.. మహేష్ అభిమానులుగా సినిమా ఎంత పెద్ద హిట్ కావాలో కోరుకోండి. సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.