Advertisementt

‘సైరా’ ఆఫర్‌ను చరణ్ ఒప్పుకుంటాడా?

Thu 02nd May 2019 12:21 PM
sudhakar reddy,sye raa,sye raa narasimha reddy,nizam rights  ‘సైరా’ ఆఫర్‌ను చరణ్ ఒప్పుకుంటాడా?
Superb Offer to Sye Raa From Nizam ‘సైరా’ ఆఫర్‌ను చరణ్ ఒప్పుకుంటాడా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వనుంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ కి అంత క్రేజ్ రాకపోవడంతో ఈ సినిమాకి ఇంకా మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు. అయితే నైజాం నుంచి మాత్రం బయ్యర్లు ఒక అడుగు ముందుకు వేసి, భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నైజాం వారికి 25 కోట్లు పైగా ఆఫర్ చేశారట బయ్యర్ కం ప్రొడ్యూసర్  నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. అయితే సుధాకరరెడ్డి కొంతకాలం నుండి సైలెంట్ గా ఉన్నారు. బయ్యర్ గా కన్నా ప్రొడ్యూసర్ గా కాస్త గట్టిదెబ్బలు తిన్నారు. అయితే ఈసారి అటువంటి తప్పు జరగకూడదని ఆయన, మరికొందరు భాగస్వాములు కలిసి, మళ్లీ డిస్ట్రిబ్యూషన్‌ను గట్టిగా చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ ప్రయత్నంలోనే నైజాం లో కాంచన 3ని పంపిణీ చేసారు. 

ఇదే ఊపుతో మరికొన్ని సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. పైగా నైజాం ఏరియా కి పెద్దగా పోటీ లేకపోవడంతో సుధాకర రెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు. కేవలం నైజాం లోనే కాకుండా ఆంధ్ర లో కూడా సినిమాలు తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. మరి సుధాకర్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ కి నిర్మాత రామ్ చరణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

Superb Offer to Sye Raa From Nizam :

Nithiin Father eye on Sye Raa Narasimha Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ