టోటల్ రష్ చూసిన విజయ్ దేవరకొండకు ఫుట్ ఏజ్ నచ్చకపోవడంతో కొంత భాగాన్ని రీషూట్ చేయాలని కోరడంతో ‘డియర్ కామ్రేడ్’ టీం రీషూట్ చేసేందుకు రెడీ అయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇవ్వన్నీ రూమర్సే అని రీసెంట్ గా టీం మొత్తం కలిసి ఓ ఫోటో దిగడంతో క్లారిటీ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పటినుండో మే 31న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజు తమిళ మూవీ సూర్య నటించిన ‘ఎన్‌జికె’ రిలీజ్ అవుతోంది.
దీంతో ‘డియర్ కామ్రేడ్’ని జూన్‌కి వాయిదా వేసారు అని అంటున్నారు. అసలు మే 31 అంటే మంచి టైం. పైగా సమ్మర్ సెలవులు కూడా ఉంటాయి. అందుకే ‘డియర్ కామ్రేడ్’ టీం ఈ డేట్ ఫిక్స్ చేసుకుంది కానీ ఇప్పుడు ‘ఎన్‌జికె’ రిలీజ్ అవుతుండడంతో క్లాష్ వద్దనుకుని ‘డియర్ కామ్రేడ్’ వేరే డేట్‌కి వెళుతోంది. దీని వల్ల బిజినెస్ పరంగా ఖచ్చితంగా ఎఫెక్ట్ వుంటుంది.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే ‘ఎన్‌జికె’ నిజంగా విజయ్ ప్లాన్స్ మార్చుకోవాల్సినంత క్రేజీ ప్రాజెక్టా? ఇటువంటి పొలిటికల్ జోనర్స్ లో మన తెలుగులో ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. పైగా ఇటువంటి చిత్రాలకు తెలుగులో అస్సలు గ్యారెంటీ లేదు. విజయ్ తన తదుపరి చిత్రాలని కూడా తమిళంలో రెగ్యులర్‌గా విడుదల చేయాలని చూస్తోన్న విజయ్ దేవరకొండ ఈసారి ఖచ్చితంగా తమిళంలో గ్యారెంటీ మార్కెట్ కోసం చూస్తున్నాడట. అందుకే ఎందుకులే రిస్క్ అని క్లాష్ ఎందుకని విజయ్ డిసైడ్ అయ్యాడట. అయితే జూన్ లో రిలీజ్ అన్నారు కానీ డేట్ ఫిక్స్ చేయలేదు.