Advertisementt

చిరు సినిమాకి అనసూయ డిమాండ్ ఇది!

Thu 02nd May 2019 07:39 AM
anasuya,chiranjeevi,remuneration,koratala shiva film,chiru 152  చిరు సినిమాకి అనసూయ డిమాండ్ ఇది!
Anasuya Remuneration for Chiru and Koratala Shiva Movie చిరు సినిమాకి అనసూయ డిమాండ్ ఇది!
Advertisement
Ads by CJ

అనసూయ మంచి యాంకరే కాదు మంచి నటి కూడా అని ఆమె నటించిన సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. బుల్లితెరపై జబర్దస్త్ అనే టీవీ షో ద్వారా బాగా పాపులర్ అయిన అనసూయ మెల్లగా నటనవైపు మొగ్గు చూపింది. అందుకే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’  లో గ్లామర్ షో పాత్ర చేసి అందరికి గుర్తుండిపోయింది. ఆ తరువాత అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’ సినిమాతో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకుంది. 

ఇక ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర అయితే ఆమె తన కెరీర్ ను మరో మెట్టు ఎక్కేలా చేసింది. ఈ పాత్రతో టాలీవుడ్ డైరెక్టర్స్ మొత్తం ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఆ పాత్ర ఆమె ఎలా చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా ఈమె మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది దాదాపు కంఫర్మ్ అని చెబుతున్నారు.

అయితే తనకు డిమాండ్ పెరిగిందని తెలుసుకున్న అనసూయ ఈ సినిమాకి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. ఆమె అడిగినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారట. ఈమూవీ లో హీరోయిన్ కి సమానంగా అనసూయ పాత్ర ఉండబోతున్నట్లు టాక్ నడుస్తుంది. చిరు సినిమా కావడంతో అనసూయ ఏమి ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు టాక్. చూద్దాం మరి ఈ పాత్ర ఆమెకు ఇంకెంత పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

Anasuya Remuneration for Chiru and Koratala Shiva Movie:

Anasuya demands 30 lakhs for Chiru and Koratala Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ