Advertisementt

‘శివన్’ టీజర్‌ రెస్పాన్స్ అదిరింది

Wed 01st May 2019 12:33 PM
tremendous,response,shivan,teaser  ‘శివన్’ టీజర్‌ రెస్పాన్స్ అదిరింది
Tremendous Response to Shivan Teaser ‘శివన్’ టీజర్‌ రెస్పాన్స్ అదిరింది
Advertisement
Ads by CJ

కల్వకోట సాయితేజ-తరుణీసింగ్ జంటగా ఎస్.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి శివన్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. యువ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శివన్’. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్ ఈనెల 25న విడుదలైంది. ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన 24 గంటల్లో హాఫ్ మిలియన్ వ్యూస్ రాబట్టి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్న ఈ చిత్రం అదే దూకుడుతో మిలియన్ వ్యూస్ సాధించి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మేము కనీసం రెండు మూడు లక్షల మందికయినా చేరువ అయితే చాలనుకున్నాం. కానీ ఇప్పటికే 10 లక్షల వ్యూస్ రావడం.. ఈ చిత్రంపై ముందు నుంచి మాకు గల నమ్మకాన్ని మరింత పెంచింది. ఇటీవలకాలంలో ట్రెండ్ సిట్టింగ్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో మా ‘శివన్’ కూడా కచ్చితంగా స్థానం పొందుతుంది’’ అన్నారు.

సి.వి.ఎల్, మహేంద్ర, డి.ఎస్.రావు, ఆశ్రిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ సుంకర-సుబ్బు నాంబా, ఎడిటింగ్: రామ్ సతీష్, కెమెరా: మీరన్, మ్యూజిక్: సిద్ధార్ధ్ సదాశివుని, పి. ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: సూర్య బైసాని-వేదకుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్, కో ప్రొడ్యూసర్: పున్నం మురళి, నిర్మాత: సంతోష్ రెడ్డి లింగాల, రచన-దర్శకత్వం: శివన్.

Tremendous Response to Shivan Teaser:

Shivan Teaser gets Huge Response

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ