Advertisementt

‘మహర్షి’ జ్యూక్‌ బాక్స్ వదిలారు

Tue 30th Apr 2019 11:33 PM
mahesh babu,maharshi,jukebox,released  ‘మహర్షి’ జ్యూక్‌ బాక్స్ వదిలారు
Maharshi Jukebox Released ‘మహర్షి’ జ్యూక్‌ బాక్స్ వదిలారు
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం....నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’, ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’, ‘పాల పిట్ట..’ పాటలకు శ్రోతల నుండి మంచి స్పందన వచ్చిందని చిత్రయూనిట్ తెలుపుతోంది. కాగా, మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన జ్యూక్ బాక్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అభిమానుల మధ్య ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ‘మహర్షి’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Maharshi Jukebox Released:

Mahesh Maharshi Jukebox on live

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ