Advertisementt

రాజశేఖర్.. పంట పండింది పో..!!

Tue 30th Apr 2019 09:32 PM
kalki,rajasekhar,theatrical rights,superb business,kalki movie  రాజశేఖర్.. పంట పండింది పో..!!
Superb Business to Rajasekha Kalki Movie రాజశేఖర్.. పంట పండింది పో..!!
Advertisement
Ads by CJ

‘గరుడ వేగ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే థ్రిల్లర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంకు ఎక్కడా లేని డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ హోల్ సేల్‌గా నిర్మాత కేకే రాధామోహన్ ఓవరాల్ బడ్జెట్ పై 40శాతం ఎక్కువ చెల్లించి ఈ రైట్స్ తీసుకున్నాడట. అలా ముందుగానే ‘కల్కి’ ప్రొడ్యూసర్స్ కు లాభాలు వచ్చేసాయి.

ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా అంతే దూకుడుగా ఉంది. టీజర్‌కి ముందు 2 కోట్లుకి అటుఇటుగా చెప్పిన నిర్మాతలు టీజర్ రిలీజ్ అయ్యాక ఇప్పుడు 2 కోట్లు పైనే చెబుతున్నారట. ఈ మొత్తం వ్యవహారాలన్నింటినీ జీవిత రాజశేఖర్ దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్. ఎందుకంటే జీవిత కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి. ఈ శాటిలైట్ రైట్స్ కోసం తెలుగులో మూడు పెద్ద ఛానెల్స్ పోటీ పడుతున్నాయని సమాచారం.

అలానే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా ‘కల్కి’ రేటు భారీగానే పలుకుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రంగంలోకి దిగింది. మరోవైపు జీ గ్రూప్ కూడా ఈ సినిమా దక్కించుకోవాలని చూస్తుంది. ఈ బిజినెస్ అనుకుంది అనుకున్నట్టు జరిగితే రాజశేఖర్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ చిత్రంగా నిలవడం ఖాయం.

Superb Business to Rajasekha Kalki Movie:

Kalki Movie Theatrical Rights Sold Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ