నిజానికి మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్. కానీ చిరు దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీనెంబర్ 150 చిరు 150చిత్రం కావడం, దశాబ్దం గ్యాప్ తర్వాత రావడం వల్ల అది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయింది. దాంతో చిరు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సై..రా..నరసింహారెడ్డి’ని తన 151వ చిత్రంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల బేనర్‌లో ఓన్‌గా రామ్‌చరణ్ నిర్మాతగా తీస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టులో వస్తుందని కాదు.. కాదు దసరా సెలవులకు లేదా దీపావళి కానుకగా వస్తుందని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరేమో ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వస్తుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో కాస్త క్లారిటీ వచ్చింది. ఇంతకాలం సై..రా చిత్రం ఇప్పటివరకు కేవలం 70 నుంచి 75శాతం వరకే పూర్తయిందని, కాబట్టి కీలకమైన గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌ల వల్ల సంక్రాంతికి రావడమే తరువాయి అంటున్నారు.
కానీ ఇటీవల చరణ్ మాత్రం సంక్రాంతికి ముందే విడుదల అవుతుందని చెప్పినా అనుమానాలు మాత్రం ఇంకా బలంగానే ఉన్నాయి. సై..రా చిత్రం షూటింగ్ 99శాతం పూర్తయిందని తెలుస్తోంది. మిగిలిన ఒక శాతం షూటింగ్, కాస్త ప్యాచ్‌వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందిట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మైలారం పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఆ తర్వాత కోకోపేట వద్ద వేసిన సెట్స్‌లో చిత్రీకరణ జరపనున్నారు. వికారాబాద్ అడవుల్లో ప్యాచ్ వర్క్‌ని పూర్తి చేయడంతో సినిమా పూర్తవుతుంది. ఇక భారీ గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. మరోవైపు సై..రా చిత్రం ఆగష్టు15న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా వచ్చే అవకాశాలు లేవు. విజువల్ ఎఫెక్ట్స్ నాటికి పూర్తి కావు. అందునా ఆగష్టు15న ప్రభాస్ సాహో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక అక్టోబర్‌లో దసరా సెలవుల సందర్భంగా, వీలుకాకుంటే దీపావళి కానుకగా సై..రాని విడుదల చేయాలని మెగా కాంపౌండ్ పట్టుదలగా ఉంది. ఇక వచ్చేసంక్రాంతికి ఇప్పటికే రజనీకాంత్-మురుగదాస్-నయనతారల దర్బార్, మహేష్-అనిల్‌రావిపూడిల చిత్రాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇక సై..రా చిత్రాన్నిఅన్ని దక్షిణాది భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇందులో చిరంజీవితో పాటు నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్‌బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగాణం నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం బాహుబలి రికార్డులను తిరగరాస్తుందని మెగాభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.