మహేష్ బాబు - వంశి పైడిపల్లి సినిమా మొదలయ్యేనాటికి కేవలం దిల్ రాజు మాత్రమే ఆ సినిమాకి నిర్మాత. అశ్విని దత్ మాత్రం సమర్పకుడిగా వ్యవహరిస్తానని.. మొదట్లో చెప్పాడు. కానీ చివరికి దిల్ రాజుతో పాటుగా అశ్వినీదత్ కూడా మహర్షి సినిమాకి నిర్మాతగా మారాడు. ఇక దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాతలుగా మహర్షి సినిమా పట్టాలెక్కే టైంకి.. నిర్మాత పీవీపీ, మహేష్ తనకి సినిమా చేస్తానని మాటిచ్చి.. తనకి డేట్స్ కూడా ఇచ్చాడని.... అది ఇప్పట్లో జరిగేలా లేదు కనక.. తాను కూడా మహర్షికి నిర్మాతగా ఉంటానని.. అడగ్గా. దానికి దిల్ రాజు ఒప్పుకోలేదు. దానితో జూన్ లో మొదలవ్వాల్సిన మహర్షి సినిమా కోర్టు మెట్లెక్కింది. పివిపి తన వ్యవహారం తేలేవరకు సినిమాని మొదలెట్టనివ్వని మంకు పట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఇక చేసేది లేక దిల్ రాజు కోర్టు బయట కాంప్రమైజ్ చేసుకుని పివీపిని కూడా మహర్షి నిర్మాతగా చేసాడు.
ఇక మహర్షి షూటింగ్ విషయంలో ఏ ఆటంకం లేకుండా సాఫీగా జరిగినా.. మధ్యలో దిల్ రాజు పెత్తనాన్ని అశ్వినీదత్ తట్టుకోలేకపోతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా అశ్వినీదత్ వలన దిల్ రాజు తలపట్టుకున్నాడనే టాక్ మొదలైంది. ఇప్పటికే 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మహర్షి సినిమా విషయంలో అశ్వినీదత్ ముందు నుండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇప్పుడు బిజినెస్ విషయంలో డిమాండ్స్ చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది అశ్వనీదత్ నిర్మించిన దేవదాసు తాలూకు బకాయిలు నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ కి కోటి అరవై లక్షల వరకు చెల్లించాల్సివుందట. అయితే ఇప్పటివరకు వాటి సెటిల్మెంట్ జరగలేదు.
అందుకే ఇప్పుడు మహర్షి బిజినెస్ లో దాన్ని అడ్జస్ట్ చేయమని సునీల్.. అశ్వినీదత్ ని అడిగినట్లు సమాచారం. మరి దానికి అశ్వనీదత్ ఒప్పుకున్నా.. మిగిలిన ఇద్దరు నిర్మాతలు దిల్ రాజు, పివిపిల నుండి వ్యతిరేకత వచ్చిందట. అంత బిజినెస్ చేసిన మహర్షికి ఇంత చిన్న మొత్తం అడ్జెస్ట్ చెయ్యడం కష్టం కాదుగా అని అంటున్నారట. ఒకవేళ అది అడ్జెస్ట్ చేయకపోతే కృష్ణా ఏరియా రైట్స్ అయినా తనకు ఇవ్వమని అశ్వినీదత్ పట్టుపడుతున్నట్లుగా సమాచారం. వాటాగా ఓ ఏరియా ఇలా ఇచ్చేస్తాం..లాభాల్లో షేర్ ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా అని మిగతా ఇద్దరు నిర్మాతలు చెప్తున్నారనే న్యూస్ ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది.