బోయపాటి ప్లాప్ సినిమా తీసినా అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ ల మీద ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా సినిమాలు భారీగానే మొదలయ్యేవి. జయ జానకి నాయకా అలా అలా ఆడినా.. వినయ విధేయరామకి భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. రామ్ చరణ్ హీరో కాబట్టి ఆ రేంజ్ బడ్జెట్ బోయపాటి ఇచ్చారు. బోయపాటి కూడా భారీ సెట్స్ అంటూ వినయ విధేయరామకి నిర్మాత చేత భారీగా ఖర్చు పెటించాడు. మధ్యమధ్యలో రామ్ చరణ్ బడ్జెట్ కంట్రోల్ చేస్తున్నాడనే టాక్ కూడా వినబడింది. కానీ వినయ విధేయరామ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో.. బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ స్టేజ్ మీద బాలకృష్ణ ఎంతో గొప్పగా.. బోయపాటితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని.. అది కూడా తన సొంత నిర్మాణ సంస్థ ఎన్ బీకే ఫిలిమ్స్ లో ఉండబోతుందని.... సినిమా ఫిబ్రవరి నుండి మొదలవుతుందని చెప్పాడు. కానీ తాజాగా బాలయ్య - బోయపాటి సినిమా మీద ఎలాంటి అప్ డేట్స్ లేవు. దానితో బాలయ్య - బోయపాటి సినిమా ఆగిపోయిందనే న్యూస్ ఒకరోజు, కాదు బోయపాటి, బాలయ్య సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నాడనే న్యూస్ మరొకరోజు, బాలయ్య ఈ సినిమాలో రెండు గెటప్స్ వెయ్యబోతున్నాడనే న్యూస్ ఇంకోరోజు ప్రచారంలోకొస్తున్నాయి.
ఇక బోయపాటికి భారీ డిజాస్టర్ ఉండడం, బాలయ్య కథానాయకుడు, మహానాయకుడుతో ఎన్ బీకే ఫిలిమ్స్ లో నిర్మాతగా నష్టపోవడంతో... ఇప్పుడు బోయపాటి చెప్పిన స్క్రిప్ట్ కి 65 కోట్ల బడ్జెట్ పెట్టడమెందుకు... 40 కోట్లలో కానిచ్చేద్దామని బాలయ్య, బోయపాటికి చెప్పాడంటున్నారు. మరోపక్క ఒకవేళ ఆ 40 కోట్లలో ఈ స్క్రిప్ట్ తో సినిమా చెయ్యలేకపోతే.. మరో కథ ప్రిపేర్ చెయ్యమని బోయపాటికి బాలయ్య సూచించినట్లుగా వార్తలొస్తున్నాయి.