నేటిరోజుల్లో యంగ్‌స్టార్స్‌కి 25వ చిత్రం అనేది ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి వంటి భారీ నిర్మాతలు ముగ్గురు ముచ్చటగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తీస్తున్న ‘మహర్షి’ చిత్రం మహేష్‌కి సంఖ్యాపరంగా 25వది కావడం విశేషతను సంపాదించుకుంది. సో.. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను మే 1వ తేదీ హైదరాబాద్‌లోని నెక్లెసరోడ్‌లో పీపుల్స్ ప్లాజాలో జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్‌తో పాటు ఈ వేడుక వేదికపై మహేష్ నటించిన 25 చిత్రాల దర్శక నిర్మాతలను పిలుస్తారని, వారితో మహేష్‌కి ఉన్న అనుబంధం గురించి మాట్లాడిస్తారని ప్రచారం సాగుతోంది. అయినా మహేష్ చాలా విషయాలలో అంతర్ముఖుడు. ఎవరో కొందరితో తప్పితే సినిమా చేసిన ప్రతి దర్శకునితో లాంగ్‌రిలేషన్ షిప్ మెయిన్‌టెయిన్ చేసే వ్యక్తి కాదు.
ఇక మహేష్ హిట్ చిత్రాల దర్శకులు చాలా మంది ఇప్పుడు ఫ్లాప్‌లలో ఉన్నారు. కొందరు ఫేడవుట్ కూడా అయిపోయారు. మరికొందరు తాము మహేష్‌తో తీసిన ఫ్లాప్ చిత్రాల గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడరు. బాబి దర్శకుడు శోభన్ మరణించాడు. ఇక మహేష్‌కి ఎంతో క్లోజ్, మహేష్-నమ్రతల పెళ్లికి పెద్దగా వ్యవహరించిన జయంత్ సి పరాన్జీ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. శ్రీకాంత్ అడ్డాల అడ్రస్ కనిపించడం లేదు. పూరీ ఫేడవుట్ అయిపోయాడు. పైగా ‘జనగణమణ’ వల్ల ఆయనకు మహేష్‌తో విభేదాలు వచ్చాయని అంటున్నారు.
ఇక ‘నాని’ తీసిన ఎస్.జె.సూర్య, ‘స్పైడర్’ తీసిన మురుగదాస్‌లు ఆ షాక్ నుంచి కోలుకుని మరలా తమ వర్క్‌లో బిజీ అయ్యారు. అయితే వేడుక అంటే అందరు వస్తే నిండుదనం వస్తుంది కానీ కొందరు రాకుండా ఉంటే అసంపూర్తిగా ఉంటుంది. అందుకే ‘మహర్షి’ టీం ఓ మంచి, ముందు చూపు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. మహేష్‌తో సినిమాలు తీసిన దర్శకులందరి వీడియో బైట్స్ తీసి ఈ వేడుకలో వారు మహేష్ గురించి చెప్పే విశేషాలను ప్రసారం చేస్తే ఏ గొడవ ఉండదని నిర్ణయించుకుందిట. నిజమే.. ఇలా చేస్తేనే అందరు ఏదో ఒకటి మహేష్ గురించి గొప్పగా మాట్లాడి అభిమానులను సంతోషపరుస్తారు. అంతేగానీ లైవ్‌గా రావాలని భావిస్తే మాత్రం సగం మంది ఎగనామం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.