కన్నడ నుండి టాలీవుడ్ కి దూసుకొచ్చిన ట్రెడిషనల్ గర్ల్.. హిట్ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగులో సూపర్ హిట్స్ కొడుతూ... యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ క్షణం ఖాళీ లేకుండా బాగా బిజీగా అయ్యింది. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోను రష్మిక హవా మొదలైపోయింది. తెలుగులో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ లో నటించింది. ఆ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. ఇక నితిన్ సరసన భీష్మ, మహేష్ సరసన అనిల్ రావిపూడి డైరెక్షన్స్ లో ఇలా బాగా బిజీ అయిన ఈ భామ ఈమధ్యన బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కుతుందనే న్యూస్ హల్చల్ చేసింది.
నిజంగానే బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి సినిమాలో రష్మికకి ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడాతో భన్సాలీ ఓ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించిన సంజయ్ లీలా బన్సాలి.. రష్మికని ఎంపిక చెయ్యడం జరిగిందట. అయితే ఆ ఆఫర్ కి రష్మిక ఎగిరి గంతేయ్యకుండా... ఆ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువ ఉండడం.. సినిమాలో పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో.. రష్మిక సున్నితంగా సంజయ్ లీలా బన్సాలి ఆఫర్ ని తిరస్కరించినట్లుగా టాక్.