Advertisementt

ఎస్‌ఎస్ ఆర్ట్స్ చిత్రం ఫూటింగ్ పూర్తయింది

Sat 27th Apr 2019 10:20 PM
ss arts,movie,press meet,details  ఎస్‌ఎస్ ఆర్ట్స్ చిత్రం ఫూటింగ్ పూర్తయింది
SS Arts Movie Shooting Completed ఎస్‌ఎస్ ఆర్ట్స్ చిత్రం ఫూటింగ్ పూర్తయింది
Advertisement
Ads by CJ

ఫ్రెష్ ల‌వ్ స్టోరీతో ఎస్ ఎస్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం

జిపిఎస్, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సోనాక్షి వ‌ర్మ, మౌని, మ‌మ‌త‌శ్రీ చౌద‌రి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో, సుమ‌న్ కీల‌క‌పాత్ర‌లో రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గ‌శ్రీ ఫిలింస్ తో క‌ల‌సి ఎస్ఎస్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ముర‌ళి రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో  పి.ఎస్.రామ‌కృష్ణ(ఆర్‌.కె) కొత్త చిత్రం నిర్మిస్తున్నారు. శ‌నివారంతో చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు పాత్రికేయుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ద‌ర్శ‌కుడు ముర‌ళి రామ‌స్వామి మాట్లాడుతూ.. ఇది డెబ్యూ సినిమా. ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ. క‌మర్షియ‌ల్ అంశాల మేళ‌వింపుగా ఉంటుంది. షూటింగ్ పూర్త‌యింది. సుమ‌న్ బాగా స‌పోర్ట్ చేశారు. హీరోయిన్స్ కోసం 200 మందిని ఆడిష‌న్ చేశాం. హీరో పాత్ర‌లో నాలుగు షేడ్స్ ఉంటాయి. జిపిఎస్ అద్భుతంగా న‌టించాడు. ఈరోజు చిత్రీక‌రించిన భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ తో టాకీ పార్ట్ పూర్త‌యింది. మిగిలిన ఒక పాట‌ను త్వ‌ర‌లో చిత్రీక‌రిస్తాం. జూన్ లేదా జులైలో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

నిర్మాతలు రామ‌కృష్ణ‌, రాహుల్ మాట్లాడుతూ.. ఇదో ట్రెండీ ల‌వ్ స్టోరీ, నేచుర‌ల్ గా ఉంటుంది. డిఫ‌రెంట్ సినిమా అవుతుంది. ద‌ర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించాడు. మంచి విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాం. 

హీరో జిపిఎస్ మాట్లాడుతూ.. క‌థ చెప్పిన‌ప్పుడు ఇది సినిమానా లేక జీవిత‌మా అనిపించింది. నాలుగు భిన్న షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాను. సుమ‌న్ గారితో న‌టించ‌డం అద్భుత‌మైన అనుభూతి అన్నారు.

హీరోయిన్ క‌పిలాక్షి మ‌ల్హోత్రా మాట్లాడుతూ... తెలుగులో ఇదే డెబ్యూ మూవీ. ఇది నాకో పెద్ద అవ‌కాశం. ఇగోయిస్టిక్ అమ్మాయిగా క‌నిపిస్తాను అని అన్నారు. 

ఈ చిత్రంలో ఫ‌న్ బకెట్ భార్గ‌వ్, షేకింగ్ శేషు, జ‌బ‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, ఫ‌స‌క్ శ‌శి న‌టించారు.

SS Arts Movie Shooting Completed:

SS Arts Movie Press Meet Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ