Advertisementt

‘అల్లాదిన్’కు మనోళ్ల వాయిస్.. అంతేగా..!!

Fri 26th Apr 2019 11:00 PM
venkatesh,varun tej,aladdin,trailer,voiceover  ‘అల్లాదిన్’కు మనోళ్ల వాయిస్.. అంతేగా..!!
Venkatesh and Varun Tej Voices for Aladdin ‘అల్లాదిన్’కు మనోళ్ల వాయిస్.. అంతేగా..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2 కోసం కలిసి పని చేశారు. వీరిద్దరు మరోసారి ఓ సినిమాకి కలిసి వర్క్ చేయనున్నారు.  అయితే ఈ సినిమాలో వీరు కలిసి నటించట్లేదు. ఒకప్పుడు చిన్నపిల్లలను ఆకట్టుకున్న ‘అల్లాదిన్’ సినిమాను ఇప్పుడు అమెరికాకు చెందిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘అల్లాదిన్’ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది. ఈ  సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాదిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే దీనికి సంబంధించిన తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్ యాక్ట్ చేసాడు. మొత్తంగా వెంకటేష్, వరుణ్ తేజ్ గొంతులతో ‘అల్లాదిన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు వున్నాయి. ఈ సినిమా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Click Here For Trailer

Venkatesh and Varun Tej Voices for Aladdin:

Venkatesh & Varun Tej Rocking Combo Again    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ